పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కోర్టులో మరోసారి చుక్కదురైంది. సూరత్ కోర్ట్ తీర్పుపై మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వలేమని గుజరాత్ హైకోర్ట్ స్పష్టం చేసింది.

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కోర్టులో మరోసారి చుక్కదురైంది. సూరత్ కోర్ట్ తీర్పుపై మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వలేమని గుజరాత్ హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ మేరకు తుది తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

కాగా.. అందరి దొంగల ఇంటి పేరు మోడీ అనే ఎందుకు ఉన్నదంటూ రాహుల్ గాంధీ కర్ణాటకలో 2019లో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్‌లోని బీజేపీ ఎమ్మెల్యే సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారించి రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఆ తర్వాత రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష ఫలితంగా రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. 

సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన పైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆ కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించలేదు. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. సూరత్ కోర్టు తనను దోషిగా తేల్చుతూ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు. తనను దోషిగా తేల్చడంలో సూరత్ కోర్టు కొన్ని పొరపాట్లు చేసిందని వాదించారు.

రాహుల్ గాంధీ ఆశించినట్టుగా గుజరాత్ హైకోర్టు తీర్పు ఇస్తే.. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కాపాడుకుంటారు. లేదంటే, ఈ వేటు ఇలాగే కొనసాగడమే కాదు.. మరో 8 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను రాహుల్ గాంధీ కోల్పోతారు.