న్యూఢిల్లీ:  దేశ భూభాగంలో ఒక్క అంగుళం కూడ వదులుకోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు లడఖ్ లో ఆయన పర్యటించారు. ఇండియా చైనా సరిహద్దులో భద్రతను ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన లడఖ్‌లో ఆర్మీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  ఇటీవల పీపీ 14 వద్ద చైనాకు మన మధ్య జరిగిన ఘర్షణలో  సరిహద్దు రక్షణ కోసం మన సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేశారని మంత్రి గుర్తు చేశారు.

also read:లడఖ్‌లో తుపాకీ ఎక్కు పెట్టిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చైనాతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కానీ దానిని ఎంతవరకు పరిష్కారమౌతాయో తాను ఇప్పుడే చెప్పలేనన్నారు. అయితే మీకు మాత్రం ఓ భరోసా మాత్రం ఇవ్వగలనని మంత్రి చెప్పారు.ఒక్క అంగుళం భూమి కూడ మనం వదులుకోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారమైతే అంతకన్నా మంచిది ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.