రాంచీ: పెళ్లి సందర్భంగా  విందు ఇచ్చే స్థోమత లేక గిరిజనుల్లోని అనేక జంటలు పెళ్లి చేసుకోకుండానే సహాజీవనం చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు జార్ఖండ్ రాష్ట్రంలో కన్పిస్తున్నాయి. తాజాగా ఇదే తరహా ఘటన మరోటి వెలుగు చూసింది.

జార్ఖండ్ రాష్ట్రంలోని చార్కాట్ నగర్ గ్రామానికి చెందిన రాజు మహ్లీ, మంకీదేవిలు పెళ్లి చేసుకోకుండానే గత 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకొన్న సమయంలో  విందు ఇవ్వడం గిరిజనుల సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని  ఎదిరించలేక ఈ దంపతులు పెళ్లి చేసుకోకుండానే సహాజీవనం చేస్తున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడ పుట్టారు. ఈ సమయంలో  వారికి పెళ్లి చేసేందుకు  ఓ స్వచ్ఛంధ సంస్థ ముందుకు వస్తే ఈ దంపతులకు పెళ్లి చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ సమయంలో  పెళ్లి చేసుకొనేందుకు ఈ దపంతులు అంగీకరించలేదు.

గిరిజనుల్లో ఉన్న కట్టుబాటు కారణంగా పెళ్లి కాకుండానే సహాజీవనం చేస్తున్న దంపతుల గురించి  నిమిట్ అనే స్వచ్ఛంధ సంస్థ ఆరా తీసింది. దీంతో  ఆసక్తికరమైన విషయాలను ఈ సంస్థ బయట పెట్టింది.

గిరిజన సంప్రదాయం ప్రకారంగా  పెళ్లి చేసుకొనే సమయంలో విందును ఇవ్వాల్సి ఉంటుంది.  విందులు ఇవ్వలేని స్థితిలో ఉన్న జంటలు పెద్దల అనుమతిని తీసుకొని సహాజీవనం చేసే వెసులుబాటు ఉంటుంది.  

సహాజీవనం చేయాలనుకొన్న యువకుడిని యువతి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక పెద్దల అనుమతి తీసుకొని    దుకా, దుక్నీల పేరుతో ఒకే ఇంట్లో నివసిస్తారు. ఇదే పద్దతిలో మహ్లీ దంపతులు కూడ సహాజీవనం చేస్తున్నారు.

గిరిజన గ్రామాల్లో  సర్వే నిర్వహించిన నిమిట్ స్వచ్ఛంధ సంస్థకు సుమారు 132 జంటలు పెళ్లి చేసుకోకుండానే సహాజీవనం చేస్తున్నట్టు గుర్తించారు. పెళ్లి చేసుకోకుండా  సహాజీవనం చేస్తున్న జంటలకు పెళ్లి చేస్తున్న వారికి వివాహాలు చేసినట్టు నిమిట్ స్వచ్ఛంధ సంస్థ ప్రకటించింది. 2016లో 21 జంటలకు, 2017లో 43 జంటలకు, 2018 లో 132 జంటలకు వివాహాలు  జరిపించినట్టు ఆ సంస్థ ప్రకటించింది