Asianet News TeluguAsianet News Telugu

హిజాబ్ ధ‌రించింద‌ని బాలిక‌కు స్కూళ్లోకి నో ఎంట్రీ.. ముస్లిం వ‌ర్గాల ఆందోళ‌న

Kerala school: హిజాబ్ ధరించినందుకు 11వ తరగతి చదువుతున్న బాలికకు కేరళ పాఠశాలలో ప్రవేశం నిరాకరించడంతో ముస్లిం సంఘాలు నిరసనలు చేపట్టాయి. స్కూల్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. 
 

No entry into school for girl wearing hijab; Protests by Muslim communities in Kerala
Author
First Published Sep 26, 2022, 4:26 PM IST

hijab-Protests: క‌ర్నాట‌క‌లోని ఒక పాఠ‌శాల‌లో రాజుకున్న హిజాబ్ వివాదం.. అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త‌ల‌కు కార‌ణ‌మైంది. పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చెల‌రేగాయి. కొన్ని రోజుల త‌ర్వాత హిజాబ్ వివాదం సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లింది. ఇప్పుడు తాజాగా కేర‌ళ‌లో హిజాబ్ వివాదం రాజుకుంది. హిజాబ్ ధ‌రించిన ఒక విద్యార్థినిని పాఠ‌శాల యాజ‌మాన్యం లోనికి అనుమ‌తించ‌లేదు. దీంతో అక్క‌డి ముస్లిం వ‌ర్గాలు ఆందోళ‌న‌ల‌కు దిగాయి. పాఠ‌శాల యాజ‌మాన్యం తీరును ఖండించాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ను తెలిపాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. కేరళలోని కోజికోడ్‌లో 11వ తరగతి విద్యార్థి హిజాబ్ ధరించినందుకు పాఠశాలలో ప్రవేశం నిరాకరించడంతో నిరసనలు చెలరేగాయి. కోజికోడ్‌లోని ప్రావిడెన్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న బాలిక హిజాబ్ (తల కండువా) ధరించినందుకు తరగతులకు హాజరుకానివ్వ‌కుండా అడ్డుకున్నార‌ని ఆరోపిస్తూ ముస్లిం సంస్థలు, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO), ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (MSF) నిరసనలు చేపట్టాయి. .

ఈ విషయాన్ని బాలికకు, ఆమె తల్లిదండ్రులకు తెలియజేసినట్లు పాఠశాల అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నా యాజమాన్యం తీరు మార్చుకోకపోవడంతో విద్యార్థిని చదువుకు స్వస్తి చెప్పింది. 'రాజ్యాంగ వ్యతిరేక' చర్యలు తీసుకున్నందున పాఠశాల గుర్తింపును  విద్యాశాఖ తొలగించాలని ముస్లిం విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పాఠశాల ముందు బైఠాయించి ఆందోళ‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన పోలీసులు నిర‌స‌న‌కారుల‌ను చెదరగొట్టారు. 

హిజాబ్ వ్యతిరేక నిరసనలు ఇరాన్ తో పాటు అనేక ఇతర దేశాలను కుదిపేస్తున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్ లో సాంప్రదాయిక దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించినందుకు (హిజాబ్) ఆ దేశ మోర‌ల్ పోలీసులు.. 22 ఏళ్ల మహసా అమినిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెపై దాడి చేయ‌డంతో ప్రాణాలు కోల్పోయింది. అప్ప‌టి నుంచి ఇరాన్ లో పెద్ద ఎత్తున ఈ ఘ‌ట‌న‌ను ఖండిస్తూ నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. హిజాబ్ ను కాల్చ‌డం, జుట్టు క‌త్తిరించుకోవ‌డం వంటి చ‌ర్య‌ల ద్వారా అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ మ‌హిళ‌లు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios