న్యూఢిల్లీ: కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కోసం 2022 వరకు సామాన్య ప్రజలు ఎదురు చూడాల్సిన అవసరం నెలకొందని ఎయిమ్స్  డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.

కరోనా వైరస్ వ్యాక్సిన్ భారత మార్కెట్లలో సులభంగా లభించడానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందన్నారు.ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణదీప్ గులేరియా ఈ విషయాన్ని తెలిపారు.

వ్యాక్సిన్ రావడానికి ఏడాది కన్నా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. మన దేశంలో జనాభా పెద్దది. ఫ్లూ వ్యాక్సిన్  మార్కెట్ నుండి వ్యాక్సిన్ ఎలా కొనుగోలు చేయవచ్చో చూడడానికి తమకు సమయం కావాలన్నారు. 

దేశంలోని ప్రతి ప్రాంతానికి వ్యాక్సిన్ చేరుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతానికి  అందించడం అతి పెద్ద సవాల్ అని ఆయన అన్నారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత దాని కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే మరొక వ్యాక్సిన్ వస్తే దానిపై పూర్తిస్తాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని గులేరియా చెప్పారు.

వైరస్ తీవ్రతను బట్టి ఎవరికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి రావాలన్నారు. 190 మందికి పైగా దౌద్య కార్యకలాపాలు అంతర్జాతీయ సంస్థల అధిపతులు వారి ప్రతినిధుల కోసం ఏర్పా