కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ వివాదాస్పద వ్యాఖ్యలు, బీజేపై ఫైర్: లోక్‌సభ నుండి విపక్షాల వాకౌట్

లోక్ సభలో  కాంగ్రెస్ పార్టీ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు  వాకౌట్ చేశారు. 

No-confidence Motion : Ruckus erupts in Lok Sabha after Cong's Adhir Ranjan's statement on PM Narendra Modi; Ranjan stopped in between lns

హైదరాబాద్: లోక్‌సభలో  కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధరిని ప్రసంగించకుండా  అడ్డుకోవడాన్ని నిరసిస్తూ  విపక్ష పార్టీల కూటమికి చెందిన ఎంపీలు  గురువారంనాడు  సభ నుండి వాకౌట్ చేశారు. లోక్ సభలో   కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి  ప్రసంగం చేసే సమయంలో  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

. ఈ సమయంలో అధికార పక్ష సభ్యులు  కాంగ్రెస్ పై  తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్య  వాగ్వాదం  చోటు  చేసుకుంది. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటు  చేసుకుంది.  ఈ సమయంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను  ప్రసంగించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. అయితే  కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.  కానీ  కేంద్ర మంత్రి  జ్యోతిరాదిత్య  సింధియా  ప్రసంగించారు. అయితే  అధిర్ రంజన్ చౌదరికి  మాట్లాడేందుకు  అవకాశం ఇవ్వకపోవడంతో  విపక్ష ఇండియా కూటమి ఎంపీలు   లోక్ సభ నుండి  వాకౌట్  చేశారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వంపై  కాంగ్రెస్ పార్టీ  అవిశ్వాసం ప్రతిపాదించింది. దీంతో  ఈ నెల  8వ తేదీ నుండి  చర్చ సాగుతుంది. అయితే  కాంగ్రెస్ పార్టీ ఎంపీ  గౌరవ్ గోగోయ్ చర్చను ప్రారంభించారు.  ఇవాళ ఈ చర్చకు  ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ  నిన్న ఈ విషయమై లోక్ సభలో ప్రసంగించారు.  మోడీపై, బీజేపీ తీరుపై  రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు  చేశారు.  ఈ విమర్శలకు  మోడీ తన ప్రసంగంలో  సమాధానం  ఇవ్వనున్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios