Asianet News TeluguAsianet News Telugu

యూపీ ఎన్నికలు: మజ్లిస్‌తో బీఎస్పీ పొత్తు.. అవన్నీ అవాస్తవాలే, తేల్చి చెప్పిన మాయావతి

త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి స్పష్టం చేశారు. మజ్లిస్ (ఏఐఎంఐఎం)తో పొత్తు పెట్టుకుంటున్నారన్న వార్తలను ఆమె ఖండించారు.

no alliance with mim clarifies bsp supremo mayawati ksp
Author
New Delhi, First Published Jun 27, 2021, 2:47 PM IST

త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి స్పష్టం చేశారు. మజ్లిస్ (ఏఐఎంఐఎం)తో పొత్తు పెట్టుకుంటున్నారన్న వార్తలను ఆమె ఖండించారు. అసద్ తో పొత్తు పెట్టుకుంటున్నారన్న మీడియా కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాయావతి.. మజ్లిస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ట్వీట్ చేశారు.

తాము అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ తో పొత్తు పెట్టుకుంటున్నామని ఓ చానెల్ కథనాలను ప్రసారం చేస్తోందని... ఆ వార్తల్లో నిజం లేదు మాయావతి అన్నారు. అవన్నీ నిరాధారమైన వార్తలని.. పంజాబ్‌లో లాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. 

తప్పుదోవ పట్టించే ఇలాంటి నిరాధారమైన వార్తలపై పోరాడేందుకు రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రాను పార్టీ నేషనల్ కో ఆర్డినేటర్ గా నియమిస్తున్నట్టు మాయావతి ప్రకటించారు. ఇలాంటి వార్తలు రాసే ముందు సతీశ్‌తో మాట్లాడి, నిజాలను నిర్ధారించుకున్నాకే వార్తలను ప్రసారం చేయాలని ఆమె మీడియాను కోరారు

Follow Us:
Download App:
  • android
  • ios