Asianet News Telugu

ఈ ప్రభుత్వంలో అధికారులు మంత్రుల మాటే వినరు.. బీహార్ మంత్రి సంచలనం..

పాట్నా: ‘బీహార్ ప్రభుత్వంలో డబ్బు లేకుండా ఏ పనీ జరగదని,  అధికారులు  సొంత మంత్రుల మాట కూడా వినరు’ ఇది అన్నది ప్రతిపక్షాలు కాదు సాక్షాత్తూ నితిష్ ప్రభుత్వంలోని మంత్రులు, మిత్రపక్షాలు నుంచి వస్తున్న విమర్శలు. 

Nitish Kumar's Own Minister Says Government Is Corrupt - bsb
Author
Hyderabad, First Published Jul 2, 2021, 12:42 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పాట్నా: ‘బీహార్ ప్రభుత్వంలో డబ్బు లేకుండా ఏ పనీ జరగదని,  అధికారులు  సొంత మంత్రుల మాట కూడా వినరు’ ఇది అన్నది ప్రతిపక్షాలు కాదు సాక్షాత్తూ నితిష్ ప్రభుత్వంలోని మంత్రులు, మిత్రపక్షాలు నుంచి వస్తున్న విమర్శలు. 

ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏ మిత్రపక్షమో, ప్రతిపక్ష నేతలో అయితే ఫరవాలేదు కానీ జేడీయూ కు చెందిన ఓ మంత్రి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బహిరంగంగా ఇలా మాట్లాడటం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చాలా ఇబ్బందికరంగా మారింది.  

బీహార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సాహ్ని గురువారం మాట్లాడుతూ, తన సొంత ప్రధాన కార్యదర్శి తన మాట వినడం లేదని, దీంతో తాను వైదొలగాలని అనుకుంటున్నానని తెలిపారు. శనివారం తన రాజీనామాను అందజేస్తామని చెప్పారు.

మంత్రిగా తాను ఆమోదం తెలిపిన తరువాత కూడా బదిలీలు, పోస్టింగులను అధికారులు తొక్కి ఉంచారని.. ఈ విషయంలో తాను అప్ సెట్ అయ్యానని సాహ్ని తెలిపారు. అధికారులకు అలా చేసే అధికారం ఉంటే.. నేను పదవిలో ఉండి ప్రయోజనం ఏమిటీ? కొన్ని సౌకర్యాలను ఆస్వాదించడానికి మంత్రిగా ఉండటానికి నేను ఇష్టపడను" అని సాహ్ని నిన్న విలేకరులతో అన్నారు.

ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారా అనే అంశం మీద మాట్లాడుతూ.. ‘నేనెందుకు చెప్పాలి. అలా చెబితే నేనతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నా అనుకుంటాడు’ అన్నారు. 

"అధికారులకు అలా చేయటానికి టెమెరిటీ ఉంటే, నా కుర్చీలో నేను మిగిలి ఉండటమేమిటి? కొన్ని సౌకర్యాలను ఆస్వాదించడానికి నేను మంత్రిగా ఉండటానికి ఇష్టపడను" అని సాహ్ని నిన్న తన ఇంటి వద్ద విలేకరులతో అన్నారు. రాజీనామా లేఖ సిద్ధమవుతోందని త్వరలో అందజేస్తానని తెలిపారు. 

ముజఫర్‌పూర్‌లోని ఓ రిమాండ్ హోమ్‌లో జరిగిన లైంగిక కుంభకోణంపై సుదీర్ఘ సిబిఐ దర్యాప్తును ఎదుర్కొన్న ఒక విభాగం విషయంలో సాహ్ని చేసిన సిఫార్సులను లెక్కలోకి తీసుకోలేదు. సాహ్నీకి మాజీ ముఖ్యమంత్రి జితాన్ రామ్ మాంజి మద్దతు తెలిపారు. మాంజి కుమారుడు సంతోష్ మంజి కూడా నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఉన్నారు.

అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) ఎమ్మెల్యేల సమావేశంలో తాను ఈ సమస్యను లేవనెత్తానని సాహ్ని అన్నారు. అధికారులు మంత్రులు జెన్యూన్ డిమాండ్లను చాలా తక్కువగా పట్టించుకుంటున్నారని అన్నారు. 

అధికారుల పోస్టింగులు, శాసనసభ్యుల నియామకం విషయంలో మంత్రులు బహిరంగంగా డబ్బులు తీసుకుంటున్నారని ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు, గైనంద్ర సింగ్ జ్ఞాను, హరిభూషణ్ ఠాకూర్ లు ఆరోపించారు. ఇది కూడా ముఖ్యమంత్రికి తలనొప్పిని మరింత పెంచింది. 

డబ్బులేకుండా ఏపనీ జరగదని గైనంద్ర సింగ్ జ్ఞాను అన్నారు. అయితే నితీష్ కుమార్ ఏమి జరిగిందో తెలుసుకోవడానికి హరిభూషణ్ ఠాకూర్ తో  మాట్లాడినట్టు సమాచారం. లోపలి నుండే ఒత్తిడి పెరగడంతో ఈసారి ముఖ్యమంత్రి బ్యూరోక్రాట్లపై ఆధారపడటం కష్టమవుతుందని స్పష్టమవుతోంది.

నితిష్ కుమార్ కు మదన్ సాహ్ని విశ్వసనీయుడిగా పేరు పొందారు. బీహార్ ఎన్నికలు జరిగిన మూడు నెలల తరువాత ఫిబ్రవరిలో మంత్రి అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios