Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయం నా భార్యకు చెప్పకుండా, మా మామగారి ఇంటిని కూల్చివేయించా.. : నితిన్ గడ్కరీ..

తాను కొత్తగా వివాహం చేసుకున్నప్పుడు జరిగిన సంఘటన గురించి మంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేసుకున్నారు. ‘మా మామగారి ఇల్లు రోడ్డు మధ్యలో ఉండేది. రోడ్డు నిర్మాణం కోసం ఇంటిని కూల్చివేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు. 

Nitin Gadkari says he once razed his father-in-law's home without telling wife
Author
Hyderabad, First Published Sep 17, 2021, 10:43 AM IST

న్యూ ఢిల్లీ : కేంద్ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హర్యానా రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన మామ గురించి మాట్లాడుతూ హాస్యం పండించారు. తాను భార్యకు చెప్పకుండానే రోడ్డు మధ్యలో ఉన్న మామ ఇంటిని కూల్చివేయాలని ఆదేశించినట్లు నితిన్ గడ్కరీ చెప్పారు. 

హర్యానా రాష్ట్రంలో ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కొత్తగా వివాహం చేసుకున్నప్పుడు జరిగిన సంఘటన గురించి మంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేసుకున్నారు.

60యేళ్ల మహిళపై 19యేళ్ల యువకుడు అత్యాచారయత్నం... ప్రతిఘటించడంతో చంపి, శవంతో దారుణం...

‘మా మామగారి ఇల్లు రోడ్డు మధ్యలో ఉండేది. రోడ్డు నిర్మాణం కోసం ఇంటిని కూల్చివేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు. దీంతో ఆ విషయం నా భార్యకు చెప్పకుండా, నేను మా మామగారి ఇంటిని కూల్చివేయమని అధికారులను ఆదేశించారు.’ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

గడ్కరీ పాల్గొన్న కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గురుగ్రామ్ లోక్ సభ సభ్యుడు రావు ఇందర్ జిత్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా పరిపాలన, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానాలో హైవేకి సంబంధించిన దాదాపు 160 కిలోమీటర్ల పనులు మార్చి 2022 నాటికి పూర్తవుతాయని కేంద్రమంత్రి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios