వీఐపీ సంస్కృతికి స్వస్తి.. నేతల వాహనాల్లోని సైరన్ల తొలగింపు.. అసలు కారణమేంటీ? 

వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ధ్వని కాలుష్యం నియంత్రణలో భాగంగా వీఐపీ వాహనాలపై సైరన్‌లకు తొలగించాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

Nitin Gadkari plans to replace sirens on VIP vehicles KRJ

వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. అలాగే.. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో వీఐపీ వాహనాలపై సైరన్‌లకు స్వస్తి పలకాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ యోచిస్తున్నట్లు తెలిపారు. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమనీ, ఈ తరుణంలో వీఐపీ వాహనాలపై సైరన్‌లకు స్వస్తి పలకాలని యోచిస్తున్నట్లు తెలిపారు. 

పూణేలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. విఐపి వాహనంపై ఉన్న రెడ్ లైట్ (బీకాన్)ను తొలిగించే అవకాశం తనకు లభించడం తన అదృష్టమనీ, ఇప్పుడు విఐపి వాహనాలపై ఉన్న సైరన్‌లకు స్వస్తి పలకాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. హారన్‌లు,సైరన్‌ల శబ్దానికి బదులుగా భారతీయ సంగీత వాయిద్యాలైనా వేణువు, తబలా,శంఖం వంటి శబ్దాలను వాటి స్థానంలో రిప్లేస్ చేయాలనుకుంటున్నామని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.  

మహారాష్ట్రలోని పూణెలోని చాందినీ చౌక్‌లో నిర్మించిన మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్‌లో మొత్తం 4 ఫ్లైఓవర్‌లు, 1 అండర్‌పాస్ నిర్మించారు. చాందినీ చౌక్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ పూణే నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించాలనే లక్ష్యంతో నిర్మించినట్టు గడ్కరీ తెలిపారు. రూ.865 కోట్ల అంచనా వ్యయంతో 16.98 కి.మీ పొడవున్న ఈ వంతెన వల్ల పుణె నగరం, జిల్లాలో ప్రధాన ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని మంత్రి తెలిపారు. 

మొత్తం 16 కి.మీ పొడవున్న ఈ ప్రాజెక్టులో 2.2 కి.మీ పొడవునా చాందినీ చౌక్ ఇంటర్‌చేంజ్ పనులు పూర్తయ్యాయి. ముంబై-బెంగళూరు హైవేకి ఇరువైపులా ఇంటర్నల్, అవుటర్ వే లను నిర్మించినట్టు చెప్పారు.ఒక ఇంటర్‌చేంజ్ నుండి 8 వేర్వేరు దిశల్లో వెళ్ళడానికి మొత్తం 8 ర్యాంప్‌లు నిర్మించబడ్డాయనీ, ఇది వివిధ ప్రాంతాలను సులభంగా అనుసంధానం చేయవచ్చని తెలిపారు. ఈ బహుళ-స్థాయి ఫ్లైఓవర్ NH-48పై పూణే- బెంగళూరు మధ్య , సమీప పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి నిర్మించబడింది. ఈ ప్రాజెక్ట్ పునాది ఐదేళ్ల క్రితం స్థాపించబడింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios