మహారాష్ట్ర హైవేపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వెదురుతో తయారు చేసిన క్రాష్ బారియర్‌ ను ఏర్పాటు చేసింది. ఇది పర్యావరణ అనుకూలమని, ప్రపంచంలోనే మొదటిదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 

మహారాష్ట్రలోని చంద్రాపూర్-యావత్మాల్ జిల్లాలను కలిపే హైవేపై 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బారియర్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ శనివారం తెలిపారు. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని తెలిపారు. ఇది దేశం, వెదురు రంగానికి గొప్ప విజయం అని అన్నారు. ఈ క్రాష్ బారియర్ ఉక్కుకు సరైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని, పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు.

Scroll to load tweet…

‘‘వణి-వరోరా హైవేపై ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బారియర్ అభివృద్ధితో ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాధించే దిశగా అసాధారణ విజయం సాధించాం’’ అని నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఈ వెదురు క్రాష్ బారియర్ కు 'బహుబలి' అని నామకరణం చేసినట్లు ఆయన చెప్పారు.

Scroll to load tweet…

ఈ విషయాన్ని తెలియజేస్తూ గడ్కరీ వరుస ట్వీట్లు చేశారు. ఇండోర్ పితంపూర్లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ (నాట్రాక్స్) వంటి వివిధ ప్రభుత్వ సంస్థలలో ఇది కఠినమైన పరీక్షలకు గురైందని, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీబీఆర్ఐ) నిర్వహించిన ఫైర్ రేటింగ్ పరీక్షలో క్లాస్ 1 గా రేటింగ్ పొందిందని చెప్పారు. దీనికి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ గుర్తింపు కూడా లభించిందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

Scroll to load tweet…

ఈ వెదురు క్రాష్ బారియర్‌ రీసైక్లింగ్ విలువ 50-70 శాతం, ఉక్కు అడ్డంకుల రీసైక్లింగ్ విలువ 30-50 శాతం ఉందని గడ్కరీ తెలిపారు. ‘‘ఈ బారియర్‌ తయారీలో ఉపయోగించే వెదురు జాతి బాంబుసా బాల్కోవా, దీనిని క్రియోసోట్ నూనెతో శుద్ధి చేసి, రీసైకిల్డ్ హై-డెన్సిటీ పాలీ ఇథిలీన్ (హెచ్ డీపీఈ)తో పూత పూశారు. ఈ క్రాష్ బ్యారియర్ ఉక్కుకు సరైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. పర్యావరణ ఆందోళనలు, వాటి పర్యవసానాలను పరిష్కరిస్తుంది. కాబట్టి ఈ విజయం వెదురు రంగానికి, మొత్తం భారతదేశానికి గుర్తించదగినది. అంతేకాక, ఇది గ్రామీణ, వ్యవసాయ-స్నేహపూర్వక పరిశ్రమ. దీంతో ఇది మరింత ముఖ్యమైన మైలురాయిగా మారింది’’ అని గడ్కరీ అన్నారు. 

Scroll to load tweet…