సారాంశం
నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం నిరాడంబరంగా ఇంట్లోనే.. కొద్దిమంది సన్నిహితుల మధ్య ఒక సాధారణ వేడుకలా జరిగింది. వివాహానికి రాజకీయ ప్రముఖులెవరూ హాజరుకాలేదు.
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురి వివాహం గురువారం జరిగింది. ఆడంభరాలకు.. భారీ ఖర్చు అతిరథ మహారథులు.. రాజకీయ ప్రముఖులు, ఆర్భాటాలకు దూరంగా అత్యంత సింపుల్ గా అయ్యింది. వారి ఇంట్లోనే కొంతమంది సన్నిహితుల మధ్య వివాహ వేడుక నిర్వహించారు.
బెంగళూరులో కుటుంబం, స్నేహితులతో ఒక సాధారణ వేడుకలా పెళ్లి నిరాడంబంరంగా జరిగిపోయింది. పెళ్లికి రాజకీయ ప్రముఖులెవరూ హాజరుకాలేదు.
నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ప్రతీక్‌తో బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఉడిపి ఆడమారు మఠం సీర్లు వధూవరులను ఆశీర్వదించారు.
వధువు ఈ ప్రత్యేక సందర్భం కోసం గులాబీ రంగు చీర, ఆకుపచ్చ బ్లౌజ్‌వేసుకుంది. వరుడు తెల్లటి పంచె, శాలువా ధరించాడు.వధువు తల్లి శ్రీమతి సీతారామన్ మొలకాల్మూరు చీర కట్టుకున్నారు.
అడమారు మఠం వైదిక క్రమంలో వివాహం జరిగింది.