ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడింది. దేశ రాజధానిలో నడిరోడ్డుపై నిర్భయపై పాశవిక దాడి చేసిన మానవ మృగాలను శుక్రవారం ఉదయం ఉరితీశారు. వారికి ఉరి తీసిన సందర్భంగా దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అన్యాయం జరిగినా.. కనీసం దోషులకు శిక్ష పడి న్యాయం జరుగుతందనే ధైర్యం ప్రజల్లో కలిగింది. అంతేకాకుండా... కూతురికి న్యాయం చేయడం కోసం నిర్భయ తల్లి ఆశాదేవి చేసిన పోరాటాన్ని పొగడకుండా ఎవరూ ఉండలేరు. అలాంటి ఆమెపై దోషుల తరపు న్యాయవాది సంచలన కామెంట్స్ చేశారు.

Also Read చట్టంలోని లొసుగులు ఇవీ: నిర్భయ దోషులు ఎలా వాడుకున్నారంటే....

ఉరిశిక్ష వేయాల్సింది ఆ నలుగురు దోషులకు కాదని.. నిర్భయ తల్లిని అసలు శిక్షించాలంటూ దోషుల తరపు న్యాయవాది చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఏడేళ్ల పాటు ఈ నలుగురిని శిక్ష నుంచి తప్పిస్తూ వచ్చిన న్యాయవాది ఏపీ సింగ్ నిర్భయ తల్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెను శిక్షించాలంటూ అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

రాత్రి 12 గంటల వరకు తన కూతురు ఎక్కడుందో, ఎవరితో ఉందో తెలియని నిర్బయ తల్లి ఆశాదేవిని శిక్షించాలంటూ డిమాండ్ చేశాడు. కాగా, అతడు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అటు కరోనా‌తో లింక్ పెట్టి.. కేంద్రం మాస్కులు ఖరీదు చేయడంలో ఆలస్యం చేస్తోందని.. అయితే ఉరితాళ్లను మాత్రం తొందరగా సిద్ధం చేస్తోందన్నాడు. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏపీ సింగ్‌ను కూడా ఉరి తీయాలంటూ తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు