దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో నలుగురు దోషులకు చావు దగ్గరపడింది. వారి ఉరిశిక్షకు డేట్ ఫిక్స్ అయ్యింది.  ఢిల్లీలో నిర్భయపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి.. ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను అధికారులు  ఒకేసారి ఉరితీయనున్నారు.

నలుగురు దోషులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ కి ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు చెప్పారు.  ఈమేరకు తీహార్ జైలులో నాలుగు ఉరికంబాలు, నాలుగు సారంగాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీన దోషులకు డెత్ వారెంట్ పై ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు తీర్పు వెల్లడించనుండగా ఆ వెంటనే వారికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే... నలుగురుని ఒకేసారి ఉరితీయడం... దేశచరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా... సరిగ్గా 7 సంవత్సరాల క్రితం 2012 డిసెంబర్ లో  దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిపై అత్యంత పాశవికంగా ఆరుగురు వ్యక్తులు కదిలో బస్సులో అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను నడి రోడ్డుపై ఒంటిపై నోలుపోగు కూడా లేకుండా వదిలేశారు. 

ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో బీరు సీసాలను గుచ్చి ఆమెకు నరకం చూపించారు. దాదాపు 13 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స పొందితన నిర్భయ... చివరకు ప్రాణాలు వదిలేసింది. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా... అందులో ఒకరు మైనర్ కావడం గమనార్హం. మరో దోషి.. జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు దోషులకు ఇప్పుడు ఉరివేయనున్నారు.