Asianet News TeluguAsianet News Telugu

త్వరలో ఉరి... నిర్భయ దోషులు జైల్లో తిండి మానేసి...

మరో దోషి....రాంసింగ్ 2013లో జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులు పవన్ కుమార్ గుప్తా, ముకేశ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లు మాత్రం ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

Nirbhaya Convicts Depressed, Refusing Food, Say Tihar jail Sources
Author
Hyderabad, First Published Dec 14, 2019, 11:32 AM IST

నిర్భయ కేసులో దోషులకు మరి కొద్ది రోజుల్లో ఉరిశిక్ష విధించనున్నారు. ఉరి తేదీ  దగ్గర పడే కొద్ది నలుగురు దోషుల్లో నిరాశ నిశ్పృహల్లో కూరుకుపోయారని జైలు అధికారులు చెబుతున్నారు.

2012 డిసెంబర్ లో నిర్భయను కదిలో బస్సులో అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నడిరోడ్డుపై  వివస్త్రను చేసి పడేశారు. ఆమె ప్రైవేట్ పార్ట్ లో గాజు ముక్కలను కూడా చొప్పించారు. కాగా... నిర్భయ దాదాపు 13 రోజలపాటు చావుతో పోరాడి ప్రాణాలు వదిలింది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా... ఒకరు మైనర్ కావడంతో మూడు సంవత్సరాల శిక్షతో విడుదలయ్యాడు.

మరో దోషి....రాంసింగ్ 2013లో జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులు పవన్ కుమార్ గుప్తా, ముకేశ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లు మాత్రం ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

ఈ నలుగురు దోషులకు మరో రెండు, మూడు రోజల్లో ఉరిశిక్ష విధించనున్నారు. కాగా... నలుగురు దోషులు  పవన్ కుమార్ గుప్తా, ముకేశ్‌, వినయ్‌ శర్మ,అక్షయ్‌ కుమార్‌సింగ్‌‌లను ప్రత్యేక జైలు గదుల్లో ఉంచి, ఒక్కొక్కరికి ఐదుగురు పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. నిర్భయ కేసు దోషి అయిన రాంసింగ్ 2013లో జైల్లో ఆత్మహత్య చేసుకున్న దృష్ట్యా ఈ నలుగురు దోషులకు తమిళనాడు పోలీసులతో నిరంతర పహరా ఏర్పాటు చేశారు.
 
శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నలుగురు దోషులు కోర్టు విచారణకు హాజరయ్యారు. నిర్భయ కేసు దోషులు నలుగురు జైల్లో సరిగా తినడం లేదని తీహార్ జైలు అధికారులు చెప్పారు. దోషులు నలుగురు గతంలో సుష్టుగా భోజనం చేసేవారని...కానీ ఉరి తీసే తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో వారు తీసుకునే ఆహారం తగ్గించారని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి.
 
తీహార్ జైల్లో నిర్భయ దోషులను ఉరి తీయనున్న 3వనంబరు ఉరి స్తంభం ప్రాంతాన్ని తీహార్ జైలు డైరెక్టరు జనరల్ సందీప్ గోయల్ తోపాటు ఇతర జైలు సీనియర్ అధికారులు సందర్శించి, ఉరి శిక్ష సన్నాహాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios