నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారయ్యింది.  ఈ నెల 22వ తేదీన ఉదయం 7గంటలకు నలుగురు దోషులకు ప్రాణం పోయేంత వరకు ఉరితీయనున్నారు.  కాగా... ఈ ఉరికి ముందే మాక్ ఉరి కార్యక్రమం చేపట్టేందుకు తీహార్ జైలు అధికారులు సన్నాహం చేస్తున్నారు.

నిర్భయపై అత్యాచారానికి పాల్పడి... అతి దారుణంగా ఆమె చావుకు కారణమైన నలుగురు దోషులు ముఖేశ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌(31)లకు అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోరా డెత్‌ వారెంట్లు జారీ చేశారు. తీహార్ జైలులోని 3వ నంబరు జైలు గదిలో నిర్భయ కేసులో దోషులకు మాక్ ఉరి కార్యక్రమం చేపట్టనున్నట్లు జైలు సూపరింటెండెంట్ చెప్పారు.

AlsoReadనిర్భయ దోషులకు మరణశిక్ష: ఉరితీసేది ఈ తేదీనే..
 
మాక్ ఉరి కార్యక్రమం సందర్భంగా పీడబ్ల్యూడీ కార్యనిర్వాహక ఇంజినీరుతోపాటు జైలు అధికారులు హాజరై పర్యవేక్షిస్తారని జైలు సూపరింటెండెంట్ చెప్పారు.పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడైన అఫ్జల్ గురును ఉరి తీసిన 3వనంబరు తీహార్ జైలు గదిలోనే నిర్భయ దోషులు నలుగురికి 22 వతేదీ ఉదయం 7 గంటలకు ఒకేసారి ఉరి తీయనున్నారు. 

ఇప్పటికే ఉరి తీసే తలారీని ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ నుంచి ఢిల్లీకి రప్పించారు. తీహార్ జైలులో ఈ నెల 22 వతేదీకి ముందే నిర్భయ దోషులకు మాక్ ఉరి కార్యక్రమం చేపట్టనున్నట్లు జైలు అధికారులు వివరించారు. నిర్భయ దోషులకు డెత్ వారంట్ జారీ చేయడంతో తీహార్ జైలు అధికారులు ఉరి తీసే ఏర్పాట్లలో మునిగిపోయారు.

కాగా.. 2012 డిసెంబర్ లో దేశరాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో  నిర్భయపై అతి పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె శరీరంలోకి బీరు సీసాలను గుప్పించి పాశవిక ఆనందాన్ని పొందరు. ఎముకలు కొరికే చలిలో.. ఒంటిపై నూలు పోగు లేకుండా ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కాగా... దాదాపు 13 రోజుల పాటు ఆమె ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చగా... ఒకరు మైనర్ కావడంతో.. జువైనల్ కోర్టుకు తరలించారు. మరొకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.