న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అయిన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేశారు నిర్భయ తల్లి. త్రి సభ్య ధర్మాసనం తీర్పు స్వాగతించారు. 

త్రి సభ్యధర్మాసనం వెలువరించిన తీర్పు చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె అభిప్రాయపడింది. నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష వేస్తారన్న నమ్మకం తనకు కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే నిర్భయ కేసులో నలుగురు దోషులలో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ తనకు వేసిన ఉరిశిక్షపై పునరాలోచించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశారు. అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ ను జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని నూతన త్రి సభ్య ధర్మాసనం కొట్టివేసింది.

దోషి అయిన అక్షయ్ కుమార్ పై త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నలుగురు నిందితులను ఉరి తీయాల్సిందేనని అభిప్రాయపడింది. దోషులపై ఎలాంటి దయ అవసరం లేదని స్పష్టం చేసింది ధర్మాసనం అభిప్రాయపడింది.

నలుగురు నిందితులను ఉరితీయాల్సిందేనని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులు క్షమించరాని నేరం చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. దోషికి క్షమాపణ కోరే అర్హత లేదని స్పష్టం చేసింది. 

మరోవైపు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించిన తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు నిందితుడు తరపు న్యాయవాది ఏపీ సింగ్. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. 

అలాగే క్షమాభిక్ష పిటీషన్ కు సంబంధించి మూడు వారాల సమయం గడువు అడిగారు నిందితుడు తరపు న్యాయవాది ఏపీ సింగ్. అయితే అందుకు త్రిసభ్య ధర్మాసనం అంగీకరించలేదు. కేవలం ఒక వారం రోజులపాటు సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. 

నిర్భయ దోషి అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ కొట్టివేత..