Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ దోషులకు ఉరి.... తలారికి ఎంతిస్తున్నారంటే..

ఈ నేపథ్యంలో.. ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ నలుగురు దోషులను ఉరి తీసేందుకు తలారి ఎంత తీసుకుంటున్నాడనే చర్చ మొదలైంది.  కాగా ఇప్పటికే ప్రత్యేకంగా మీరట్ నుంచి పవన్ జల్లాడ్ అనే తల్లారిని తీహార్ జైలుకు తీసుకువచ్చారు. 

Nirbhaya case: Hangman Pawan Jallad to get Rs 20,000/execution
Author
Hyderabad, First Published Mar 18, 2020, 12:38 PM IST

నిర్భయ దోషులకు ఈ నెల 20వ తేదీన ఉరిశిక్ష వేయడం ఖాయమని అనిపిస్తోంది. ఈసారి నిర్భయ దోషులకు ఉరి ఖాయం అని అనుకున్న ప్రతిసారీ.. ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తోంది.  చట్టంలోని లొసుగులన్నింటినీ వాడుకొని నిర్భయ దోషులు ఇప్పటికి చాలా సార్లు ఉరిని వాయిదా వేస్తూ వచ్చారు. ఈసారి కూడా మళ్లీ అలాంటి ప్రయత్నమే ఏదో చేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే... అధికారులు మాత్రం ఈసారి ఉరి ఖాయమేనని చెబుతున్నారు.

Also Read కొత్త డ్రామా: విడాకులు కోరిన నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ భార్య..

ఈ నేపథ్యంలో.. ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ నలుగురు దోషులను ఉరి తీసేందుకు తలారి ఎంత తీసుకుంటున్నాడనే చర్చ మొదలైంది.  కాగా ఇప్పటికే ప్రత్యేకంగా మీరట్ నుంచి పవన్ జల్లాడ్ అనే తల్లారిని తీహార్ జైలుకు తీసుకువచ్చారు. శుక్రవారం ఉరి శిక్ష అమలు చేయనుండగా.. బుధవారం దానికి సంబంధించి రిహార్సిల్స్ కూడా చేశారు.

అయితే..  ఇప్పుడు ఈ నలుగురిని ఉరి తీయడానికి తలారి పవన్ కి... అధికారులు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున మొత్తం రూ.80వేలు తీసుకొని వారిని ఉరి తీస్తున్నట్లు చెప్పారు.కాగా.. నలుగురి కోసం ప్రత్యేకంగా తయారు నాలుగు తాళ్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. ముందు జాగ్రత్త కోసం మరో నాలుగు తాళ్లను అదనంగా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు.

ఈ నలుగురు దోషులను ఉరితీయడానికి పవన్ ఒప్పందం చేసుకుని సంతకం చేశారని, ఉరి తర్వాత దోషులను తనిఖీచేయడానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కాగా, ఓ జైల్లో డబ్బులు తనకు తక్కువగా ఇస్తున్నారంటూ మరో జైలులో తలారీగా 2015లో పవన్ జల్లాడ్ చేరి వార్తల్లో నిలిచాడు. అయితే, తలారికి నెలవారీగా వేతనం చెల్లించరని అతడు పేర్కొన్నారు. కేవలం నెలకు రూ.3,000 మాత్రమే చెల్లిస్తారని, అది కూడా ఒక్కసారి ఇవ్వరని పవన్ తెలిపాడు.


 

Follow Us:
Download App:
  • android
  • ios