ఊరిశిక్ష అమలుకు సమయం దగ్గర పడుతున్న కొద్ది నిర్భయ దోషులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తూనే ఉన్నారు. తాజాగా తనకు మెడికల్ ట్రీట్‌మెంట్ కావాలంటూ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది.

అంతకుముందు తన మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించడంపై వినయ్ శర్మ ఎన్నికల కమీషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరించిన సమయంలో ఢిల్లీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని అతను పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

Also Read:నిర్భయ కేసులో మరో ట్విస్ట్: ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన దోషి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించే అధికారం మంత్రి మనీష్ సిసోడియాకు లేదని ఆయన అన్నాడు. వినయ్ పిటిషన్ పై సోసిడియా డిజిటల్ సంతకం చేయాల్సి ఉందని, అలా కాకుండా క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు వాట్సాప్ స్క్రీన్ షాట్ పంపించారని ఏపీ సింగ్ చెప్పారు.

మెర్సీ పిటిషన్ ను ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించింది. ఆ తర్వాత అది రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రకటించారు. మెర్సీ పిటిషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 14వ తేదీన తోసిపుచ్చింది. 

వినయ్ శర్మ క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు జనవరి 14వ తేదీన తోసిపుచ్చింది. తల గాయానికి, కుడి చేతి ఫ్రాక్చర్ కు, మానసిక అనారోగ్యానికి, స్కిజోఫ్రెనియాకు తనకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్న కొద్ది గంటల్లోనే వినయ్ శర్మ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాడు.

Also Read:నా కూతురికి న్యాయం జరగకుంటే... నిర్భయ తల్లి షాకింగ్ కామెంట్స్

నిర్భయ కేసులో అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మకు మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష వేయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దాని నుంచి తప్పించకోవడానికి వినయ్ శర్మ చేయని ప్రయత్నమంటూ లేదు.