Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ కేసు: ఢిల్లీ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం, సుప్రీంలో కేంద్రం పిటిషన్

నిర్భయ దోషుల ఉరితీతపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషులను విడిగా ఉరి తీయొద్దన్న హైకోర్టు తీర్పుపై పిటిషన్ వేసింది. దోషులను వెంటనే ఉరి తీసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ పిటిషన్‌లో కోరింది. 

Nirbhaya case: Centre move Supreme Court after High Court says hang all convicts together
Author
New Delhi, First Published Feb 5, 2020, 5:15 PM IST

నిర్భయ దోషుల ఉరితీతపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషులను విడిగా ఉరి తీయొద్దన్న హైకోర్టు తీర్పుపై పిటిషన్ వేసింది. దోషులను వెంటనే ఉరి తీసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ పిటిషన్‌లో కోరింది.

అంతకుముందు నిర్భయ కేసు దోషుల ఉరితీతపై ఇచ్చిన స్టే ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి షాక్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దోషుల ఉరితీతపై విధించిన స్టేను ఎత్తేస్తూ దోషులను విడివిడిగా ఉరి తీయడానికి అనుమంతించాలనే కేంద్రం అనుమతిని తిరస్కరించింది. 

Also Read:నిర్భయ కేసు: కేంద్రానికి హైకోర్టు షాక్, దోషులకు వారం గడువు

దోషులను విడివిడిగా ఉరి తీయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. నులుగురిని కూడా ఒకేసారి ఉరితీయాలని స్పష్టం చేసింది. ఉరిశిక్ష అమలుపై జరుగుతున్న జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు దోషులకు వారం రోజుల గడువు విధించింది. వారంలోగా న్యాయపరమైన అవకాశాలను పూర్తి చేసుకోవాలని ఆదేశించింది. 

అధికారుల నిర్లక్ష్యం  వల్లనే రకరకాల పిటిషన్లు తెరపైకి వచ్చాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిర్భయ దోషుల ఉరితీతపై ట్రయల్ కోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్టేను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దోషులను విడివిడిగా ఉరితీయడానికి అనుమతించాలని కూడా కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. 

Also Read:నిర్భయ దోషుల ఉరిపై స్టే ఎత్తివేత పిటిషన్: తీర్పు రిజర్వ్

ఫిబ్రవరి 1వ తేదీన ఉరి శిక్షను అమలు చేయాలనే డెత్ వారంట్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ముగ్గురు దోషులు అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు ట్రయల్ కోర్టు అనుమతించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios