పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  బంగారు ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ బ్రిటన్‌లో తలదాచుకొంటున్నట్టు ఆ దేశం  సోమవారం నాడు ప్రకటించింది.


లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగారు ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ బ్రిటన్‌లో తలదాచుకొంటున్నట్టు ఆ దేశం సోమవారం నాడు ప్రకటించింది.

దీంతో నీరవ్ మోడీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐ సన్నాహలు చేపట్టింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు రూ.13500 కోట్లకు కుచ్చుపెట్టాడని నీరవ్ మోడీపై సీబీఐ కేసు నమోదు చేసింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన విషయం వెలుగుచూడకముందే నీరవ్ మోడీ ఇండియా దాటి వెళ్లిపోయాడు. నీరవ్ మోడీ కోసం సీబీఐ గాలింపు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే నీరవ్ మోడీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసును కూడ జారీ చేసింది.

ఈ తరుణంలో నీరవ్ మోడీ తమ దేశంలోనే ఉన్నాడని బ్రిటన్ ప్రకటించింది.దరిమిలా నీరవ్ మోడీని బ్రిటన్ నుండి ఇండియాకు రప్పించేందుకు సీబీఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.