పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న సుభాష్ శంకర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న సుభాష్ శంకర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈజిప్ట్‌లోని కైరోలో సుభాష్ శంకర్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. ముంబైకి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సుభాష్ శంకర్ అత్యంత సన్నిహితుడు. ఈ కేసకు సంబంధించి శంకర్‌ను భారత్‌కు రప్పించేందుకు సీబీఐ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 13 వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్న ఎగ్గొట్టినట్టుగా నీరవ్ మోదీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌కు సంబంధించి విచారణ చేస్తున్న సీబీఐ అభ్యర్థన మేరకు.. ఇంటర్‌పోల్ నీరవ్, అతని సోదరుడు నిషాల్ మోడీ మరియు అతని ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్‌లపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.
ఇక, 2018లో కేసు నమోదైనప్పటి నుంచి సుభాష్ శంకర్ పరారీలో ఉన్నాడు. అతడు కైరోలో అజ్ఞాతంలో దాక్కున్నాడు. తమకు అందిన ఇన్‌పుట్‌ల ఆధారంగా సీబీఐ ఆపరేషన్ నిర్వహించి శంకర్‌ని పట్టుకుంది. అతడిని ప్రత్యేక విమానంలో సీబీఐ అధికారులు.. ముంబైకి తీసుకొచ్చారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని సీబీఐ కోర్టులో శంకర్‌ను హాజరుపరచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.
ఇక, ఈ కేసులో నీరవ్ మోదీపై రెండు సెట్ల క్రిమినల్ ప్రొసీడింగ్‌లు ఉన్నాయి. రుణ ఒప్పందాలను మోసపూరితంగా పొందడం ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను పెద్ద ఎత్తున మోసానికి పాల్పడినందుకు సంబంధించిన సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ ఆదాయాన్ని లాండరింగ్ చేయడానికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో కేసును నమోదు చేసింది.
ఈ కేసుకు సంబంధించి సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను అదృశ్యం కావడాని కారణమయ్యాడనే ఆరోపణలను కూడా నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నాడు. వీటిని సీబీఐ కేసులో చేర్చారు.
