Asianet News TeluguAsianet News Telugu

Nipah: భయంకరమైన 'నిపా వైరస్' కలకలం.. ఇద్దరు మృతి, ఆరోగ్యశాఖ అప్ర‌మ‌త్తం

Nipah Virus (NiV): నిఫా అనేది జూనోటిక్ వైరస్, ఇది జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ఆ త‌ర్వాత మాన‌వుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ మొదట గుర్తించిన మలేషియా గ్రామం పేరు మీద పెట్టారు. ఎగిరే నక్కలు అని కూడా పిలువబడే పండ్ల గబ్బిలాలు నిఫా వైరస్ ను కలిగివుంటాయి.  నిపా వైరస్ సంక్రమణ కారణంగా రెండు అసహజ మరణాలు సంభవించడంతో కేరళ ఆరోగ్య శాఖ సోమవారం కోజికోడ్ జిల్లాలో ఆరోగ్య హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారని ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
 

Nipah Virus (NiV) suspected in 2 fever deaths, alert sounded in Kozhikode, Kerala, Veena George RMA
Author
First Published Sep 12, 2023, 11:18 AM IST

Nipah: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రత్యేకమైన మందులు లేదా వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో లేని నిపా వైర‌స్ దేశంలో క‌ల‌క‌లం రేపుతోంది. కేర‌ళ‌లో నిపా వైర‌స్ అనుమానిత కేసుల‌తో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డంతో ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. నిఫా అనేది జూనోటిక్ వైరస్, ఇది జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ఆ త‌ర్వాత మాన‌వుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ మొదట గుర్తించిన మలేషియా గ్రామం పేరు మీద పెట్టారు. ఎగిరే నక్కలు అని కూడా పిలువబడే పండ్ల గబ్బిలాలు నిఫా వైరస్ ను కలిగివుంటాయి.  నిపా వైరస్ సంక్రమణ కారణంగా రెండు అసహజ మరణాలు సంభవించడంతో కేరళ ఆరోగ్య శాఖ సోమవారం కోజికోడ్ జిల్లాలో ఆరోగ్య హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారని ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

కోజికోడ్‌లో నిపా వైరస్‌ సోకిన అనుమానంతో నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. గత కొద్దిరోజులుగా మరణించిన ఇద్దరికి నిపా పరీక్ష ఫలితాలు నేడు వెల్ల‌డికానున్నాయి. నివారణలో లక్షణాలను సరిగ్గా అర్థం చేసుకోవడం, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. నిపా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, 4 నుండి 14 రోజులలో లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అరుదైన సందర్భాల్లో ఇది 21 రోజుల వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కోజికోడ్ లో ఇద్దరు వ్యక్తుల అసహజ మరణం నేపథ్యంలో సేకరించిన నమూనాల పరీక్షా ఫలితాలు మంగళవారం రాత్రికి వస్తాయని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. నిఫా ఇన్ఫెక్షన్ కు చెక్ పెట్టే అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. పూణేలోని వైరాలజీ ల్యాబ్ లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. మృతుల్లో ఒకరి స్వాబ్లు, వ్యాధి లక్షణాలు ఉన్నవారిని పరీక్షలకు తీసుకున్నట్లు మంత్రి మీడియాకు తెలిపారు.

నిఫా వైరస్ అనుమానిత నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కోసం మంత్రి వీణా జార్జ్ కోజికోడ్ చేరుకున్నారు. కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన‌ట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఆగస్టు 30న తొలి మరణం సంభవించింది. నిన్న రెండో మరణం సంభవించింది. మృతులిద్దరూ దాదాపు గంటపాటు ఒకే ఆసుపత్రిలో ఉన్నారు. గతంలో కూడా వారు ఒకరితో ఒకరు కాంటాక్ట్ లో ఉన్నారని స్పష్టమైందని ఆరోగ్య మంత్రి తెలిపారు. అది నిపా అయి ఉండొచ్చనే అనుమానం మాత్రమే ఉంద‌ని తెలిపారు. అన్ని సందేహాల ఆధారంగా ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. అనుమానిత నిపా అనుమానితులతో కాంటాక్ట్ అయిన వారిని రిస్క్ ను బట్టి వర్గీకరిస్తామని మంత్రి తెలిపారు. అయితే, దీనికి సంబంధించిన రిపోర్టులు అందిన త‌ర్వాత పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌ని పేర్కొన్నారు. 

పరీక్షల ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైందని మంత్రి తెలిపారు. తొలుత మృతుడి స్వాబ్ ను పరీక్షలకు తీసుకోలేకపోయారు. ఆయనకు ఇతర అనారోగ్యాలు ఉన్నాయి. ఆయన సమీప బంధువులకు వ్యాధి లక్షణాలు కనిపించడం అనుమానాలకు తావిస్తోందని ఆరోగ్య మంత్రి తెలిపారు. రెండో మృతుడి మృతదేహానికి దహన సంస్కారాలు జరగలేదు. పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించనున్నార‌ని మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios