ఊటీలో ఓ తొమ్మిదో తరగతి బాలిక కిడ్నాప్ అయ్యింది. ఆమె మీద హత్యాచారం జరిగింది. గ్రామంలోని పొదల్లో ఆ చిన్నారి మృతదేహం లభించింది.
చెన్నై : తమిళనాడులోని ఊటీలో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని హత్యాచారానికి గురైంది. ఆ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా తేలింది. సోమవారం ఉదయం ఊటీ బైక్రా ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ఓ కుగ్రామం నుంచి స్కూలుకు వెళ్ళింది ఆ బాలిక. ఆ తర్వాత అక్కడ నుంచి తిరిగి రాలేదు. రావాల్సిన టైంకు ఇంటికి కూతురు తిరిగి వచ్చే టైం అయిపోయానా.. రాక పోవడంతో తల్లిదండ్రులు ఆ బాలిక కోసం అన్ని చోట్ల వెతికారు.
కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి అన్నిచోట్లా వెతికారు. ఈ క్రమంలో ఆంకార్ బోర్డు ప్రాంతంలో ఉన్న పొదలచాటున ఆ బాలిక మృతదేహం స్థానికులకు కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు మొదట దగ్గరికి వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. అది తమ కూతురుదే కావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
గ్యాంగ్‌స్టర్ ఆనంద్ విడుదలపై బీహార్ సర్కార్ పునరాలోచన చేయాలన్న ఐఏఎస్ అసోసియేషన్
ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ హత్యాచారం మీద విచారణ జరిపారు. బాలికమృతదేహం పడి ఉన్న చోటుకు దగ్గరలో ఓ కారు పార్కు చేసి ఉండడం కనిపించింది. వెంటనే వారు ఆ కారు ఎవరిది అనే వివరాలను సేకరించారు. ఆ కారు కక్కకోడమందు ప్రాంతానికి చెందిన రాజేష్ కుట్టన్ కు చెందిందని గుర్తించారు.
వెంటనే అతని కోసం వెతకగా రాజేష్ కుట్టన్ పరారీలో ఉన్నాడని తేలింది. ఆ 9వ తరగతి బాలికను రాజేష్ కుట్టనే కారులో కిడ్నాప్ చేసి ఉంటాడని.. తర్వాత అనుచరులతో కలిసి అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటాడని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో భాగంగా భావిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు బాలికను అత్యాచారం చేసి, హత్య చేసినవారిని అరెస్టు చేస్తేనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని నిరసన తెలిపారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు శాంతించి పోస్టుమార్టానికి ఒప్పుకున్నారు.
