హీరో నిఖిల్ పెళ్లి.. బుట్టబొమ్మలా మెరిసిపోయిన వధువు
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా పెరిగిపోతోంది. పాజిటివ్ కేసుల సంక్ష కూడా గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ని మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
దీని కారణంగా చాలా మంది ఫంక్షన్స్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఇద్దరు తెలుఉ హీరోలు నిఖిల్, నితిన్ తమ వెడ్డింగ్స్‌ని వాయిదా వేసుకున్నారు. అయితే కన్నడ హీరో, కర్ణాటక మాజీ సీఎం కొడుకు నిఖిల్ గౌడ మాత్రం తన పెళ్లి వాయిదా వేసుకోవడానికి ఇష్టపడలేదు.
అందుకే.. శుక్రవారం ఆయన తాను ప్రేమించిన రేవతి మెడలో మూడుముళ్లు వేసి తనదానిని చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా.. కేవలం వధూవరుల అతి కొద్ది మంది బంధువుల మధ్య వీరి వివాహం ముగిసింది. పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిసిపోతున్నారు.
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. వీరి పెళ్లి కి కొన్ని గంటల ముందు కుమారస్వామి ఓ వీడియో విడుదల చేశారు. తమ కుమారుడి పెళ్లికి అందరినీ ఆహ్వానించాలని భావించినప్పటికీ.. లాక్ డౌన్ కారణంగా కుదరలేదని చెప్పాడు.
తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇంటి నుంచే వధూవరులను ఆశీర్వదించాలని ఆయన కోరారు. కాగా.. లాక్ డౌన్ తర్వాత వీరి పెళ్లి రెసెప్షన్ గ్రాండ్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.