చాప కింద నీరులా కరోనా: పంజాబ్ సీఎం కీలక నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో వున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు సైతం నడిచేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తొమ్మిది జిల్లాలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే గతంలో కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకూ కొనసాగేది. దీనిని ప్రభుత్వం రెండు గంటల ముందుకు జరిపింది.
లుథియానా, జలంధర్, పాటియాలా, మోహాలి,అమృత్‌సర్, గురుదాస్ పూర్, హోషియార్‌పూర్, కపూర్‌తాలా, రోపర్ జిల్లాలో నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నగరాల్లో రోజుకు 100 యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.
ఇక మీదట కరోనా కేసులు పెరిగితే మరింత కఠినమైన ఆంక్షలు తీసుకోడానికి ఏమాత్రం వెనుకంజ వేసేది లేదని సీఎం వెల్లడించారు. ఇంకా కఠిన చర్యలు, నిర్ణయాలు ఉంటాయని ఆయన రాష్ట్ర ప్రజలకు ముందుగానే సంకేతాలు ఇచ్చారు.
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఇష్టమున్నా, లేకపోయినా... కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అమరీందర్ సింగ్ తేల్చిచెప్పారు. పంజాబీల ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం కఠిన నిర్ణయాలు తప్పవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.