పెళ్లి పేరుతో 300 మంది యువతుల్ని మోసగించాడో కేటుగాడు. మాట్రిమోని సైట్లు, సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది మహిళల్ని నమ్మించి.. కోట్లు కొల్లగొట్టాడు. ఎట్టకేలకు ఈ సైబర్ వరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నోయిడా : పెళ్లి పేరుతో దాదాపు 300 మంది Indian womenను మోసగించి కోట్లు కొల్లగొట్టిన Nigerianని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. నైజీరియాలోని లాగోస్ ప్రాంతానికి చెందిన గరుబా గలుంజే (38) దక్షిణ ఢిల్లీలోని Social media, వివాహ సంబంధ వెబ్సైట్ల ద్వారా యువతులతో స్నేహం చేసుకునేవాడు.. తనను తాను కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడిగా పరిచయం చేసుకుని జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లు వల విసిరేవాడు.
ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్ జిల్లాలో నివాసముంటున్న ఓ యువతి ఫిర్యాదుతో నిందితుడి మోసం బయటపడింది. ‘జీవన్ సాథి’ వివాహ వెబ్సైట్ లో ఈమె కూడా తన పేరు నమోదు చేసుకుంది. ఈ వెబ్సైట్ ద్వారా ఆమెకు పరిచయం అయిన వ్యక్తి ఇండో-కెనడియన్ అయిన తన పేరు సంజయ్ సింగ్ అని చెప్పినట్లు నోయిడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రీటా యాదవ్ తెలిపారు.క్రమంగా ఆమె విశ్వాసం పొందిన ఆ వ్యక్తి పలు దఫాలుగా రూ. 60 లక్షల మేర వివిధ బ్యాంకు ఖాతాలకు జమ చేయించుకున్నాడు.
తాను మోసపోయినట్టు యువతి ఆలస్యంగా గ్రహించింది అని మీడియాకు వెల్లడించారు. ఈ విషయమై తనకు ఫిర్యాదు అందిన తర్వాత కూపీ లాగడంతో నైజీరియన్ గుట్టు రట్టయి అరెస్టు చేసినట్లు రీటా యాదవ్ వెల్లడించారు, విచారణలో ఇలా దాదాపు మూడు వందల మంది మహిళలను అతను మోసం చేసినట్లు తేలింది.
ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లాలోని నంద్యాల మండలం mitnala గ్రామానికి చెందిన 24 ఏళ్ల వయసున్న యువతి ఒకదానిమీద ఒకటి మూడు marriages చేసుకుంది. అయితే ఇందులో ఎవరికీ విడాకులు ఇవ్వకపోవడం విచిత్రం. బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం… మిట్నాలకు చెందిన మేరీ jacinta అలియాస్ మేరమ్మ కూతురు శిరీషకు గతంలో అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన పాణ్యం మల్లికార్జునతో మొదటి వివాహం అయ్యింది.
ఆయనతో విడాకులు తీసుకోకుండా ఆత్మకూరు మండలం కొత్తపల్లెకి చెందిన శ్రీనివాస్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో విడాకులు పొందక ముందే బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం వాసి మహేశ్వరరెడ్డిని మనవాడేందుకు నిర్ణయించుకుంది. ఆయనకు కూడా రెండో వివాహం కావడంతో.. తనకు రక్షణగా ఐదు లక్షలు రూపాయలు డిపాజిట్ చేయాలని షరతు విధించింది. ఆయన ఫిబ్రవరి 1న.. రూ.5 లక్షలు డిపాజిట్ చేయగా.. ఫిబ్రవరి 5న మద్దిలేటి స్వామి ఆలయంలో వారిద్దరికీ వివాహం అయ్యింది.
అయితే శిరీష తల్లి మేరమ్మ తరచూ ఆర్ఎస్ రంగాపురం వస్తూ తన కూతురిని అత్తారింట్లో ఉంచాలంటే కొంత ఆస్తి రాసి ఇవ్వాలని అని డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చిన మహేశ్వరరెడ్డి.. శిరీష గురించి విచారించగా.. ఆమెకు ఇప్పటికే రెండు వివాహాలు జరిగినట్లు తెలుసుకుని ఆవాక్కయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.
