కర్ణాటకలో సంచలనం సృష్టించిన  బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసును ఇక నుంచి ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. 

బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం తెలిపారు. జూలై 27న దక్షిణ కన్నడలోని బెల్లారేలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై నెట్టారును దారుణంగా న‌రికి చంపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు. అలాగే స్కూళ్లకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. 

‘‘ నేను సింగపూర్ వెళ్తే బాగుండేది..ఈ ప‌రిణామం ఢిల్లీకి, ఇండియాకు అవ‌మానం’’ - అర‌వింద్ కేజ్రీవాల్

ఈ హత్య కేసుకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను హవేరి జిల్లాలోని సావనూర్ కు చెందిన జాకీర్ (29), బెల్లారేకు చెందిన మహ్మద్ షఫీక్ (27)గా గుర్తించారు. అరెస్టయిన నిందితులు అతివాద ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐతో త‌మ‌కు సంబంధాలు ఉన్నాయ‌ని ధృవీకరించినట్లు ‘టైమ్స్ నౌ’ గురువారం నివేదించింది. నిందితులకు పీఎఫ్ఐతో లింక్ లు ఉన్నాయ‌ని వెలుగులోకి వ‌చ్చిన అనంత‌రం సీఎం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. 

Scroll to load tweet…

ప్రవీణ్ దారుణ హత్యను సీఎం బొమ్మై ఖండించారు. ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారిని త్వరలో అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న..నిందితుల‌ను ప్ర‌భుత్వం ఎలాంటి ప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్టబోద‌ని చెప్పారు. ‘‘ ఇంటెలిజెన్స్ వింగ్‌తో పాటు కమాండోల టాస్క్‌ఫోర్స్‌కు దీని కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. వారు ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూస్తారు. నిందితులను త్వరలో పట్టుకుంటారు. అంతర్ రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, అందుకే నేను ఇప్పుడు ప్రతిదీ వెల్లడించలేను. ’’ అని ఆయన అన్నారు.

తమిళనాడులో నలుగురికి మంకీపాక్స్ లక్షణాలు: పుణెకి శాంపిల్స్ తరలింపు

శాంతికి విఘాతం కలిగించడానికి, రాష్ట్రంలో మత ఉద్రిక్తతలను రేకెత్తించడానికి కుట్రలు పన్నిన జాతి వ్యతిరేక, ఉగ్రవాద సమూహాలను వెంబడించడానికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ, ఇంటెలిజెన్స్, మందుగుండు సామగ్రి, వనరులతో ఒక కమాండో దళాన్ని ఏర్పాటు చేస్తుందని బొమ్మై చెప్పారు. అవసరమైతే, నేరస్తులను వెంబడించడానికి తమ ప్రభుత్వం రాష్ట్రంలో ‘యోగి మోడల్’ ను అవలంభిస్తుందని సీఎం గురువారం చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉగ్రవాదం లేదా అల్లర్లతో ముడిపడి ఉన్న కేసుల్లో నేరస్తుల ఆస్తులను రికవరీ చేయడం, కూల్చివేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవడంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి పేరుగాంచిన సంగతి తెలిసిందే.