దేశంలో ఉగ్రకుట్రకు ప్లాన్ వేసిన మరో 9 మంది ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. 2015 డిసెంబర్‌లో ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో 15 మందికి శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు  నిర్ణయం తీసుకుంది.

ముస్లిం యువకులను ఉగ్రవాదంపై ఆకర్షించి ఐసిస్‌లో చేరేలా ప్రేరేపించిన 19 మందిని ఎన్ఐఏ 2015లోనే అరెస్ట్ చేసింది. ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసిన వీరు.. ఐసిస్ టార్గెట్‌లను నెరవేర్చేందుకు కుట్రపన్నారు.

హైదరాబాద్, బెంగళూరు, ముంబై, యూపీలో మీటింగ్‌లు పెట్టుకున్న సానుభూతిపరులు.. సిరియాలో ఉంటున్న యూసుఫ్ అల్ హింద్ అలియాస్ అంజన్ భాయ్ ఆదేశాలను అమలు చేయడమే వీరి పని. ఈ విషయాలను కోర్టు ముందు నిరూపించడంలో ఎన్ఐఏ విజయవంతమైంది. అయితే ఈ నెల 22 ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వీరికి శిక్ష ఖరారు చేయనుంది.