ముంబై: సస్పెన్షన్ కు గురైన పోలీస్ అధికారి సచిన్ వాజేకు చెందిన ఓ బైక్ ను స్వాధీనం చేసుకొన్నారు ఎన్ఐఏ అధికారులు.

ఈ బైక్ సచిన్ వాజేతో అసోసియేట్ గా ఉన్న మహిళ పేరుతో రిజిష్టర్  అయి ఉంది. ఈ బైక్ విలువ సుమారు 7 లక్షలు ఉంటుందని ఎన్ఐఏ అంచనా వేసింది. నాలుగు ఏళ్లుగా ఈ బైక్ ను సచిన్ వాజే ఉపయోగిస్తున్నారని గుర్తించారు. పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ నివాసం అంటిలియా సమీపంలో పేలుడు పదార్ధాలతో నిండిన కారును ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన పోలీసులు గుర్తించారు. ఈ కారు యజమాని అనుమానాస్పదస్థితిలో మరణించారు. 

ఈ కేసులో సచిన్ వాజేను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. మరోవైపు సచిన్ వాజే తో సంబంధం ఉన్న ో మహిళను కూడ ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఈ మహిళ ఫ్లాట్ లో కూడ ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు.మరోవైపు కీలకమైన సీసీటీవీ పుటేజీని కూడ ఎన్ఐఏ స్వాధీనం చేసుకొంది. సచిన్ వాజే మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు శివాజీ మహరాజ్ టెర్మినల్ కు వెళ్లున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.