Asianet News TeluguAsianet News Telugu

ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో తెలంగాణ వాసి

మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌ ను ఎన్ఐఏ విడుదల చేసింది. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు, అరాచకులు జాబితాలో ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోని వారంతా పరారీలో ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. లిస్ట్ లో వాళ్ల ఆచూకీ తెలిపితే లక్షల రూపాయల రివార్డులను అందజేస్తామని ప్రకటించింది. 
 

NIA releases list of most wanted fugitives
Author
Delhi, First Published Oct 22, 2018, 9:05 PM IST

ఢిల్లీ: మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌ ను ఎన్ఐఏ విడుదల చేసింది. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు, అరాచకులు జాబితాలో ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోని వారంతా పరారీలో ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. లిస్ట్ లో వాళ్ల ఆచూకీ తెలిపితే లక్షల రూపాయల రివార్డులను అందజేస్తామని ప్రకటించింది. 

ఎన్‌ఐఏ విడుదల చేసిన జాబితాలో అత్యధిక మొత్తం రివార్డు కలిగి ఉన్న వ్యక్తి తెలంగాణ వాసి. అతనే మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి. గణపతి ఆచూకి తెలియజేసిన వాళ్లకి రూ.15 లక్షలు నజరానా ప్రకటించింది ఎన్‌ఐఏ  
 
ఎన్ఐఏ విడుదల చేసిన లిస్ట్ లో నేరగాళ్లు పరారీలో ఉన్నారని వారి ఆచూకీ తెలిసిన వాళ్లు సమాచారం ఇవ్వాలంటూ నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ కోరింది. జాబితా లో పరారీలో ఉన్న ఉగ్రవాదులు, మావోయిస్టులు, దొంగనోట్ల చలామణిదారులు, దేశద్రోహనికి, దేశంపై యుద్దానికి పథకం వేసిన వారి పేర్లు ఉన్నట్లు తెలిపింది. అయితే మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నవాళ్లలో అందరికీ రివార్డు ప్రకటించలేదు. దేశంలో ఉగ్రదాడులకు పథకం వేసి పాకిస్తాన్‌లో దాగిన టెర్రరిస్టులపై మాత్రం ఎలాంటి రివార్డు ప్రకటించలేదు. 
 
ఎన్ఐఏ అధికారులు 258 మంది మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాను ప్రకటించారు. ఎన్ఐఏ వెబ్‌సైట్‌లోనూ, ట్విట్టర్‌లోనూ పరారీలో ఉన్న ఆ నేరగాళ్ల ఫోటోలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వారిలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయిద్, హిజ్‌బుల్ ముజాహిదీన్ చీఫ్ సలావుద్దీన్, నవంబర్‌ 26 ముంబై పేలుళ్ల కుట్రలో మాస్టర్ మైండ్ అయిన జకీఉర్ రహ్మన్ లక్వీల పేర్లు మెుదటి వరుసలో ఉన్నాయి. వారి సమాచారం కోసం ఇప్పటికే ఇంటర్ పోల్ సాయాన్ని ఎన్ఐఏ కోరింది.
 
ఎన్ఐఏ వాంటెడ్ లిస్టులో మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు సుమారు 15మంది పేర్లు ఉండగా వారిలో మెుదటి స్థానం గణపతిది కాగా తర్వాత స్ధానంలో నంబాళ కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఉన్నారు. బస్వరాజ్ ఆచూకీపై రూ.10లక్షలు ప్రకటించింది. ఈ లిస్టులో ఉన్న వారిలో 98మందిపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాగున్న 57మంది నేరగాళ్ల సమాచారం ఇస్తే వారికి 25వేల రూపాయలు నుంచి 15లక్షల రూపాయలు వరకు నగదు పురస్కారం ఇస్తామని ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు.
 
ఇకపోతే ఈ జాబితాలో పాకిస్థాన్ కు చెందిన వాళ్లు కూడా ఉన్నారు. దాదాపు 15మంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నట్లు ఎన్ఐఏ ప్రకటించింది. వారిలో హిజ్‌బుల్ టెర్రరిస్టు జునాయిద్ అక్రం మాలిక్ పై రూ.10 లక్షలు ప్రకటించింది. మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నవాళ్ల గురించి తమకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ స్పష్టం చేసింది.
 
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు ప్రతిఏటా తాము నమోదు చేసిన కేసుల్లో పరారీలో ఉన్న నేరగాళ్ల వివరాలతో మోస్ట్ వాంటెడ్ జాబితాను రూపొందిస్తుంది. ఆ జాబితాకు సంబంధించిన సమాచారాన్ని దేశంలోని అన్ని నిఘా విభాగాలకు తెలియచేస్తుంది. ఈనేపథ్యంలోనే ఈయేడాది కూడా 258మందితో మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌ను ఎన్‌ఐఏ ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios