New Delhi: ఖలిస్తాన్ ఉగ్రవాద-గ్యాంగ్ స్టర్ నెట్ వర్క్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆరుగురిని అరెస్టు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, గ్యాంగ్ స్టర్లు అర్ష్ దల్లా, లారెన్స్ బిష్ణోయ్, జగ్గు భగవాన్ పురియా, గోల్డీ బ్రార్ ల సన్నిహితులను ఎన్ఐఏ ఇటీవల జరిపిన దాడుల్లో అరెస్టు చేసింది.
NIA hits at Khalistan terror-gangster network: జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల ఎనిమిది రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, జగ్గు భగవాన్ పురియా, గోల్డీ బ్రార్ సన్నిహితులు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కెనడాకు చెందిన ఉగ్రవాది అర్ష్ దల్లాకు సన్నిహితుడైన లక్కీ ఖోకర్ అలియాస్ డెనిస్ కూడా ఉన్నాడు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ, రాజధాని పరిధి ప్రాంతం (ఎన్సీఆర్), మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో నిర్వహించిన ఈ సోదాల్లో అరెస్టయిన వారిలో గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, జగ్గు భగవాన్ పురియా, గోల్డీ బ్రార్ ల అనుచరులు ఉన్నారు.
భటిండాకు చెందిన ఖోఖర్ ను రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో మంగళవారం నాడు అరెస్టు చేశారు. కెనడాలోని అర్ష్ దాలాతో ప్రత్యక్షంగా, తరచూ సంప్రదింపులు జరిపేవాడనీ, అతను రిక్రూట్ మెంట్లు చూసుకునేవాడనీ, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు నిర్వహించేందుకు అతని నుంచి నిధులు తీసుకున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. అర్ష్ దల్లా ఆదేశాల మేరకు పంజాబ్ లోని అర్ష్ దల్లా సహచరులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చాడు. పంజాబ్ లోని జాగ్రావ్ లో ఇటీవల జరిగిన హత్యకు కూడా వీటిని ఉపయోగించినట్టు సమాచారం.
ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, ఐఈడీలు తదితరాల స్మగ్లింగ్ కు పాల్పడుతున్న దల్లా కోసం ఖోఖర్ పనిచేస్తున్నాడని ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ తో సహా అనేక ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు భారతదేశంలోని అంతర్జాతీయ-అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ ఆయుధాలు ఇతర పేలుడు పదర్థాలు అందిస్తున్నారని సమాచారం. అరెస్టయిన వారిలో హరి ఓం అలియాస్ టితూ, లఖ్వీర్ సింగ్ ఉన్నారు. లఖ్వీర్ వద్ద తొమ్మిది ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అతను కరుడుగట్టిన నేరస్థుడనీ, గతంలో ఈ కేసులో అరెస్టయిన చోటూ రామ్ బాత్ అనుచరుడని తెలిపారు. ఈ కేసులో కౌశల్ చౌదరి, అమిత్ దాగర్, సుఖ్ప్రీత్ సింగ్, భూపీ రాణా, నీరజ్ బవానా, నవీన్ బాలి, సునీల్ బల్యాన్ సహా 9 మంది నిందితులను ఎన్ఐఏ ఇప్పటివరకు అరెస్టు చేసింది.
సురేందర్ చౌదరి, దలీప్ బిష్ణోయ్ లు గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, జగ్గు భగవాన్ పురియా, కెనడాకు చెందిన క్రిమినల్ గోల్డీ బ్రార్ కు సన్నిహితులని అధికార ప్రతినిధి తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరఫున నిధులు సేకరించడం, యువతను రిక్రూట్ చేసుకోవడం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వీరిని అరెస్టు చేశారు. ఈ కేసును కూడా గత ఆగస్టులో ఎన్ఐఏ నమోదు చేసింది. లారెన్స్ బిష్ణోయ్, జగ్గు భగవాన్ పురియా, కాలా జతేరి, కాలా రాణా, జోగిందర్ సింగ్, రాజేష్ కుమార్, రాజు బసౌది, అనిల్ చిప్పి, నరేష్ యాదవ్, షాబాజ్ అన్సారీ సహా 10 మంది నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం అరెస్టయిన సురీందర్ చౌదరిపై హత్యాయత్నం, దోపిడీలకు సంబంధించి ఎన్డీపీఎస్ చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి. హర్యానాలో అక్రమ మద్యం కాంట్రాక్టులు, మద్యం, మైనింగ్ కాంట్రాక్టర్ల నుంచి అక్రమ మద్యం, దోపిడీలకు పాల్పడుతూ ఉగ్రవాద ముఠాలకు ప్రధాన ఆర్థిక దారుగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు.
