26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా అధినేత మహ్మద్ హఫీజ్ సయీద్‌పై ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు ఎన్‌బిడబ్ల్యు (నాన్ బెయిలబుల్ వారెంట్) జారీ చేసింది.

26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా అధినేత మహ్మద్ హఫీజ్ సయీద్‌పై ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు ఎన్‌బిడబ్ల్యు (నాన్ బెయిలబుల్ వారెంట్) జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో టెర్రర్ ఫండింగ్ కేసులో ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఆరోపణలను కోర్టు గుర్తించింది. దీనిలో భాగంగానే హఫీజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ముంబై దాడులకు సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని.. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌తో పాటు ఐఎస్ఐ నుంచి అతను డబ్బును స్వీకరిస్తున్నట్లు ఇడి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేష్ రానా ఎన్‌ఐఏ స్పెషల్ జడ్జి ప్రవీణ్ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

కాగా, పాకిస్తాన్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాద నిధుల కేసులో హఫీజ్ సయీద్‌తో పాటు ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దావా (జెయుడి)కు చెందిన ముగ్గురు సభ్యులకు 6 నెలల శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Scroll to load tweet…