Asianet News TeluguAsianet News Telugu

పీఎఫ్‌ఐ ఉగ్ర చర్యలకు కళ్లెం.. ఆరు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు 

నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కార్యకలాపాలకు సంబంధించి ఎన్‌ఐఏ ఆరు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. గతేడాది ప్రధాని మోదీ బీహార్‌ పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించడానికి పీఎఫ్‌ఐ యత్నించినట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది.

NIA Conducts Raids in 6 States Against Banned PFI KRJ
Author
First Published Oct 12, 2023, 5:50 AM IST

బీహార్‌లోని ఫుల్వారిషరీఫ్‌కు సంబంధించిన ఘజ్వా-ఎ-హింద్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దూకుడు పెంచింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిర్వహిస్తున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టింది. ఈ  విచారణల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇరవై ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

ఈ  మేరకు ఢిల్లీలోని ఫజల్‌పూర్, షాహీన్ బాగ్, ఓఖ్లా, చాందినీ చౌక్‌తో సహా వివిధ ప్రదేశాలలో ఈ సోదాలు నిర్వహించింది. మరోవైపు.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో, మహారాష్ట్రలోని థానే,ముంబైల్లో,  రాజస్థాన్‌లోని టోంక్ , గంగాపూర్ సిటీ జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, సిద్ధార్థ్ నగర్, సంత్ రవిదాస్ నగర్, కాన్పూర్, గోరఖ్‌పూర్‌లలో, అలాగే.. తమిళనాడులోని మధురైలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది . 

సోదాల సమయంలో PFIకి వ్యతిరేకంగా పలు కీలకమైన సాక్ష్యాధారాలు లభ్యమయ్యాయి. ఇందులో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, సిమ్ కార్డ్‌లు, మెమరీ కార్డ్‌లు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు వంటి వివిధ డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి.  అంతేకాకుండా.. ఈ  ఆపరేషన్ సమయంలో నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. సోదాల్లో  రూ. 8.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడిలో 2047 నాటికి భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు NIA పేర్కొంది. NIA జూలై 2022 నుండి ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది ఎన్ఐఏ.. ఇప్పటివరకు 13 మంది నిందితులపై మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ కేసులో అథర్ పర్వేజ్, మహ్మద్ జలాలుద్దీన్ ఖాన్, నూరుద్దీన్ ఝాంగి అలియాస్ అడ్వకేట్ నూరుద్దీన్, అర్మాన్ మాలిక్ అలియాస్ ఇంతియాజ్ అన్వర్‌లను అరెస్టు చేశారు.

ఈ కుట్ర కేవలం ఫుల్వారిషరీఫ్‌కే పరిమితం కాదు

పీఎఫ్‌ఐ గజ్వా-ఏ-హిద్ కుట్ర కేవలం ఫుల్వారిషరీఫ్‌కే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా విస్తరించిందని విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. నిషేధిత సంస్థ సిమి (స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా)తో సంబంధం ఉన్న అన్వర్‌ రషీద్‌ను కూడా ఘజ్వా-ఏ-హింద్‌ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారి తెలిపారు.

ఫూల్వారిషరీఫ్‌లో రికవరీ చేసిన ఘజ్వా-ఎ-హింద్ పత్రాన్ని సిద్ధం చేయడంలో అన్వర్ రషీద్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. దానిని PFI యొక్క ఎజెండాగా మార్చాడు. SIMIపై నిషేధం తరువాత.. అన్వర్ రషీద్ వహ్దత్-ఎ-ఇస్లామీ అనే సంస్థలో చేరాడు. భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే ఎజెండాను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అన్వర్ రషీద్‌తో సంబంధం ఉన్న పబ్లిషింగ్ హౌస్ పాత్ర కూడా విచారణలో వెలుగులోకి వస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios