Asianet News TeluguAsianet News Telugu

మావోయిస్టులతో లింక్స్: ఎన్ఐఏ ఆరెస్టు చేసిన ఆరుగురు వీరే...

నిషేధిత మావోయిస్టు గ్రూప్ తో సంబంధాలున్నాయనే కారణంతో ఎన్ఐఎ ఏపీ, తెలంగాణల్లో ఆరుగురిని అరెస్టు చేసింది. ఇరు రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో 31 చోట్ల ఎన్ఐఎ సోదాలు నిర్వహించింది.

NIA arrests 6 persons alleged links with Maoists
Author
Hyderabad, First Published Apr 1, 2021, 5:32 PM IST

హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరుగురిని అరెస్టు చేసింది. బుధవారంనుంచి ఎన్ఐఏ అధికారులు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాగంగా ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది.

మణికొండ శ్రీనివాస రావు, వంగి నాగన్న, అందులూరి అన్నపూర్ణ, జంగిరాల కోటేశ్వర రావు, బొప్పిడి అంజమ్మ, రేల రాజేశ్వరిలను ఎన్ఐఏ అరెస్టు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఎ తెలిపింది. ఈ సోదాలు తెలుగు రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో జరిగాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 63 మందిపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. వీరిలో ప్రస్తుతం ఆరుగురిని అరెస్టు చేసింది.

తమ తనిఖీల్లో ఎన్ఐఏ అధికారులు 180కి పైగా సీడీలను, 44 సిమ్ కార్డులను, 40 సెల్ ఫోన్లను, 19 పెన్ డ్రైవ్ లను ఎన్ఐఎ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పది లక్షల రూపాయల నగదుతో పాటు మావోయిస్టు సాహిత్యాన్ని కూడా ఎన్ఐఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీడియో, ఆడియో టేప్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.  

విప్లవ రచయితల సంఘం (విరసం), పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల నాయకులను లక్ష్యంగా చేసుకుని ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. నిషేధిత మావోయిస్టు గ్రూప్ అగ్ర నేత అక్కిరాజు హరగోపాల్ సతీమణి పద్మ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అలాగే, కడప జిల్లా ప్రొద్దుటూరులోని పౌర హక్కుల సంఘం నేత వరలక్ష్మి ఇంట్లో సోదాలు చేశారు. మరో విరసం నేత పినాకపాణి నివాసంలో కూడా సోదాలు జరిగాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios