తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లైన 8 నెలలకే అత్త ఆరళ్లు తట్టుకోలేక ఓ కొత్త కోడలు బలవన్మరణానికి పాల్పడితే.. మరో రెండు ఘటనల్లో తల్లిదండ్రులు మందలించారని ఇద్దరి చిన్నారులు ప్రాణాలు తీసుకున్నారు. 

ఎన్నో ఆశలతో కాపురానికి వచ్చిన కొత్త కోడలు అత్త తో గొడవలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కోసూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హోసూరు తల్లి రోడ్డు లోని అప్పావు నగర్ కు చెందిన ముత్తు భార్య దేవయాని (25). ముత్తు, దేవయానిలకు ఎనిమిది నెలలక్రితమే పెళ్లి జరిగింది.  అప్పటినుంచి అత్తా కోడళ్ళ మధ్యతరచూ గొడవ జరుగుతుండేది. బుధవారం రాత్రి కూడా గొడవ పెరగడంతో దేవయాని ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. హోసూరు డీఎస్పీ మురళి కేసు విచారణ చేపట్టారు.

ఇక మరో కేసులో మత్స్యగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేలకొండపల్లికి చెందిన ప్రజాపతి కొడుకు రితీష్ కుమార్ (16) పదవ తరగతి చదువుతున్నాడు. బుధవారం మిత్రులతో కలిసి బయటికి వెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీంతో తల్లి నిలదీయడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పూలపల్లి సమీపంలోని రోడ్డు పక్కన చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎనిమిదవ తరగతి తల్లిదండ్రులు మందలించడంతో ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు కుమార్ (13) 8వ తరగతి విద్యార్థి. ఏం జరిగిందో కానీ మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ అలవాటును మానుకుని బుద్దిగా చదువు కోవాలని తల్లిదండ్రులు అతడిని మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.