Asianet News TeluguAsianet News Telugu

పెళ్లికి వస్తానని రానివారికి ఫైన్.. 240 డాలర్ల ఇన్వాయిస్ పంపిన నూతన దంపతులు

తమ పెళ్లికి వస్తానని హామీనిచ్చి రాలేనివారికి చికాగోకు చెందిన నూతన దంపతులు ఫైన్ విధించారు. వారందరికీ ఎంతో ఖరీదైన రీసార్ట్‌లో సీట్లు, డిన్నర్‌, ఇతర ఏర్పాట్లు చేశామని, కానీ, తమకు తెలియజేయకుండానే వారి స్వతహాగా గైర్హాజరవ్వడానికి నిర్ణయం తీసుకుని తమను నష్టాలపాలు చేశారని మండిపడ్డారు. దానికి బాధ్యత వహించాలని, అందుకే వారిపై పెట్టిన ఖర్చును తమకు పంపాలని ఇన్వాయస్‌లు పంపారు. ఇన్వాయిస్ కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది.

newly wed chicago couple angry with guests who did not turn up to ceremony, sends invoice to pay amount
Author
Chicago, First Published Aug 29, 2021, 6:30 PM IST

న్యూఢిల్లీ: ఆ దంపతులు పెళ్లిని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. బంధుమిత్రుల మధ్య వైభోగంగా చేసుకోవాలనుకున్నారు. టూరిస్ట్ డెస్టినేషన్‌లో వెడ్డింగ్‌‌కు ప్రణాళికలు వేసుకున్నారు. భారీ ఖర్చుతో పెళ్లికి సెటప్ చేసుకున్నారు. బంధువులు, మిత్రులకు ఆహ్వానం పంపారు. వారంతా వస్తానని అన్నారు. కానీ, పెళ్లి రోజు చాలా మంది డుమ్మా కొట్టడంతో నూతన జంటకు చిర్రెత్తుకొచ్చింది. ప్రత్యేకంగా వారి కోసం ఎంతో డబ్బు పెట్టి డిన్నర్, ప్రత్యేక సీట్లను బుక్ చేశామని, వారు మరీ నిర్లక్ష్యంగా వస్తామని చెప్పి రాకుండా తమతో వృథాగా ఖర్చు పెట్టించారని ఆక్రోశించారు. అంతే, నిర్లక్ష్యానికి బాధ్యత వహించాల్సిందేనని భావిస్తూ గైర్హాజరైన వారందరికీ ఆ దంపతులు 240 డాలర్లు చెల్లించాలని ఇన్వాయిస్‌లు పంపారు. ఇన్వాయిస్ కాపీని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ తతంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది అభ్యంతరం తెలిపినా, చాలా మంది తాము ఇలాంటి అనుభవమే ఎదుర్కోన్నామంటూ ఆవేదన చెందుతూ దంపతుల నిర్ణయం సరైందేనని సమర్థించారు.

చికాగోకు చెందిన డౌగ్ సైమన్స్, డెడ్రా మెక్‌గీలు తమ మిత్రులకు, ఆప్తులకు పెళ్లికి ఆహ్వానం పంపారు. జమైకాలోని రాయల్టన్ నెగ్రిల్ రీసార్ట్ స్పాలో వెడ్డింగ్ ప్లాన్  చేశారు. ఎంత ఖర్చైనా భరిస్తామని నిర్ణయించుకున్నారు. కానీ, వస్తామని చెప్పిన చాలా మంది పెళ్లికి రాలేదు. నాలుగైదు సార్లు వస్తున్నారా? అని కన్ఫమ్ చేసినా, వస్తామని చెప్పారని దంపతులు పేర్కొన్నారు. ఫలితంగా వారితోపాటు మరొకరికి(ప్లస్ వన్) అన్ని సదుపాయాలను అక్కడ బుక్ చేశామని తెలిపారు. తీరా కార్యం రోజే రాలేదని వాపోయారు. ముందుగా వారు రావట్లేదని చెప్పినా తాము అర్థం చేసుకునేవారిమని, నిర్లక్ష్యంగా వస్తామని చెప్పి తమతో వారు ఇద్దరికి బిల్లులు ఊరికే కట్టించేలా చేశారన్నారు. అందుకే ఈ ఇన్వాయిస్ ఆలోచన వచ్చిందని తెలిపారు.

ఇన్వాయిస్ కాపీని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి, దీన్ని చూసి భయపడొద్దని రాశారు. తమ పెళ్లికి వస్తామని హామీనిచ్చి గైర్హాజరైనవారికి ప్రత్యేకంగా వీటిని ఈమెయిల్ చేశామని, ఈమెయిల్ అందుతుందో లేదో అనే అనుమానంతో మెయిల్ కూడా పంపామని తెలిపారు. వారు ముందుగా పెళ్లికి రావట్లేదని చెప్పకుండా తమతో డబ్బులు పెట్టించినందుకు వారు 240 అమెరికన్ డాలర్లు తమకు బాకీ పడ్డట్టయ్యారని వివరించారు. దయచేసి ఆ డబ్బులను తమకు నెలలోపు కట్టాలని సూచించారు. పోస్టు అందగానే తమకు కాల్ చేసి ఏ విధంగా డబ్బులు చేయాలనుకుంటున్నారో తెలియజేయాలని తెలిపారు.

ఇన్వాయిస్ ఐడియాపై చాలా మంది తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాము కూడా ఎన్నో కలలతో ఇలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేస్తే కొందరు వస్తామని చెప్పి నిష్కర్షగా రాలేదని, కనీసం రాలేమనీ చెప్పకుండా తమ వేడుక రోజున తమలో నిరాశను నింపారని ఆవేదన చెందారు.

Follow Us:
Download App:
  • android
  • ios