పెళ్లి చేసుకున్న మొదటి రాత్రే నవ దంపతులు మృతి.. పోస్టుమార్టంలో తేలిన విషయమిదే!

ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బహ్రెచ్ జిల్లాలో మే 30వ తేదీన పెళ్లి చేసుకున్న ప్రతాప్ యాదవ్, పుష్పలు అదే రోజు రాత్రి మరణించారు. పెళ్లి చేసుకున్న మరుసటి రోజే వారిద్దరూ విగత జీవులై కనిపించారు.
 

Newly married uttar pradesh couple found dead next morning kms

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నవ దంపతుల జీవితం మొదలైన రోజే ముగిసింది. పెళ్లి చేసుకున్న మొదటి రోజు రాత్రే నవ దంపతులు మరణించారు. ఉదయం వారిద్దరూ విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన బహ్రేచ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోస్టుమార్టం నివేదికలో వారిద్దరూ హార్ట్ ఎటాక్‌తో మరణించారని తేలింది.

20 ఏళ్ల ప్రతాప్ యాదవ్, 20 ఏళ్ల పుష్ప మే 30వ తేదీన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరూ గదిలోకి వెళ్లారు. కానీ, ఉదయం వారిద్దరూ విగత జీవులై కనిపించారు.

పోలీసులకు విషయం తెలియగానే స్పాట్‌కు చేరుకున్నారు. ఈ రెండు డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ తరలించారు.

Also Read: పేరు మార్చుకుని మహిళను నమ్మించి మోసం చేశాడు.. తండ్రితోనూ అక్రమ సంబంధానికి బలవంతం

ఈ పోస్టుమార్టం నివేదికలో భార్య, భర్త ఇద్దరూ హార్ట్ ఎటాక్‌తో మరణించినట్టు ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు.

భార్య భర్తలు ప్రతాప్, పుష్ప ఇద్దరినీ గ్రామ ప్రజలు ఒకే చితిపై దహనం చేశారు.

 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు తన పేరును మార్చుకుని మహిళతో పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఆమెతో కలిశాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. అనంతరం, తన తండ్రితోనూ అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. తన గుర్తింపును దాచినందుకు ఈ వ్యక్తి పై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు కూడా చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios