Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో ప్రారంభం కాకముందే కుప్పకూలిన వంతెన .. రూ. 14 కోట్లు నీటిపాలు

బీహార్ లోని షాహెబ్‌పూర్ కమల్ బ్లాక్ సమీపంలోని విష్ణుపూర్ అహోక్ గండక్ ఘాట్ వద్ద నిర్మించిన వంతెన ఆదివారం కూలిపోయింది. దాదాపు 206 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ వంతెన నిర్మాణానికి 14 కోట్లు ఖర్చు చేసినట్లు అందిన సమాచారం.

Newly constructed bridge collapses in Bihar's Begusarai
Author
First Published Dec 19, 2022, 1:22 PM IST

బీహార్ ప్రభుత్వ వ్యవస్థలోని అవినీతి వెలుగులోకి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయట పడింది. ప్రారంభం కాకమునుపే ఓ వంతెన కుప్పకూలింది. దాదాపు రూ.13 కోట్ల ప్రజ ధనం నీటి పాలయ్యాయి. ఈ ఘటన బెగుసరాయి జిల్లాలోని సాహెబ్‌పూర్ కమల్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..  బెగుసరాయి జిల్లాలో గండక్‌ నదిపై ముఖ్యమంత్రి నాబార్డు పథకం కింద విష్ణుపూర్ అహోక్ , సాహెబ్‌పూర్ కమల్‌లను కలిపేందుకు 206 మీటర్లు పొడవు ఉన్న 'హై-లెవల్ RCC వంతెన'ను నిర్మించారు.

ఈ వంతెన నిర్మాణం కోసం 13.43 కోట్లు వెచ్చించారు. ఫిబ్రవరి 2016 లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణ పనులు ఆగస్టు 2017లో పూర్తయ్యాయి. ఈ వంతెన సహాయంతో బెగుసరాయ్ జిల్లాలోని బఖ్రీ, గర్హ్‌పురా , ముంగేర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అలాగే ఖగారియా జిల్లా ప్రజల ప్రయాణానికి ఉపయుక్తంగా ఉండేది.  

అయితే అప్రోచ్‌ రోడ్‌ పనులు ఇంకా చేపట్టకపోవడంతో వంతెనను ప్రారంభించలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వంతెనకు పగుళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలోనే అది కూలిపోయింది. వార్తా సంస్థ ANI ప్రకారం.. వంతెన కొన్ని రోజుల క్రితం పగుళ్లు ఏర్పడింది. 2, 3 పిల్లర్ల మధ్య వంతెన ముందు భాగం ఆదివారం కూలిపోయింది. గత నెలలో నలందా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ఓ కూలీ మరణించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios