Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో న్యూయ‌ర్ వేడుక‌లు ర‌ద్దు- ప్ర‌క‌టించిన బీఎంసీ

కరోనాను కంట్రోల్ చేయడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై పట్టణంలో న్యూయర్ వేడుకలు నిషేదిస్తున్నామని బీఎంసీ ప్రకటించింది. 

New Year celebrations in Mumbai canceled - BMC announced
Author
Mumbai, First Published Dec 25, 2021, 12:35 PM IST

ఒమిక్రాన్ వేరియంట్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. ఒమిక్రాన్ ను నియంత్రించ‌డానికి చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. అందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లు ఢిల్లీ, క‌ర్నాట‌క రాష్ట్రాలు క్రిస్మ‌స్‌, న్యూయ‌ర్ వేడుక‌లు ర‌ద్దు చేశాయి. ఆ దారిలోనే ఇప్పుడు మ‌హారాష్ట్రలోని  బొంబాయ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఓ నిర్ణ‌యం తీసుకుంది. ముంబై పట్ట‌ణంలో న్యూయ‌ర్ వేడుకుల‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని బీఎంసీ (బొంబాయ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌) శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  ముంబై న‌గ‌రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయ‌ని దీంతో ఆంక్ష‌లు విధిస్తున్నామ‌ని బీఎంసీ ప్ర‌క‌టించింది. ప‌ట్ట‌ణంలోని ఏ ప్రాంతంలో అయినా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో న్యూయ‌ర్ వేడుకలు, ఏ ఇతర పార్టీల‌కు అనుమ‌తి లేద‌ని మున్సిపల్ క‌మిష‌న‌ర్ ఐఎస్ చాహ‌ల్ తెలిపారు. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల సంద‌ర్భంగా కోవిడ్ - 19 కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. దీనిని నివారించ‌డానికి కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని తెలిపారు. 

జమ్మూ కశ్మీర్ లో కొసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత.. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

రాత్రి 9 నుంచి ఉద‌యం 6 వ‌రకు ఆంక్ష‌లు...
పెరుగుతున్న క‌రోనా కేసులు నియంత్రించ‌డానికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. అందులో భాగంగా రాత్రి 9 నుంచి ఆంక్ష‌లు విధించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిబంధ‌న‌లు శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌క‌టించింది. ఈ ఆంక్ష‌ల ప్ర‌కారం.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండ‌కూడ‌దు. అలాగే రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, థియేటర్లు, జిమ్‌లు కేవ‌లం 50 శాతం సామ‌ర్థ్యంతో ప‌ని నిర్వ‌హించుకోవాలి. ఫంక్ష‌న్ హాళ్లు, క‌ల్యాణ మండ‌పాలకు కూడా ఈ నిబంధ‌న‌లు వర్తిస్తాయ‌ని చెప్పింది. వివాహాలు, ఇత‌ర ఫంక్ష‌న్లకు కేవ‌లం 100 మంది మాత్ర‌మే హాజ‌ర‌వాల‌ని సూచించింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో నిర్వ‌హించే వివాహాల‌కు 250 మంది వ‌ర‌కు మిన‌హాయింపు ఉంటుంద‌ని పేర్కొంది. 

భారత్‌లో 415కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే..?

ఢిల్లీ, క‌ర్నాట‌క రాష్ట్రాల దారిలోనే..
మ‌హారాష్ట్రలో కేసుల రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉన్నాయి. ఢిల్లీ త‌రువాత మ‌హారాష్ట్రలోనే కొత్త వేరియంట్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనాను కంట్రోల్ చేయ‌డానికి ఢిల్లీ, క‌ర్నాట‌క ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న విధానాన్ని మ‌హారాష్ట్రలోనూ అమ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. గ‌త రెండు వేవ్‌లు, లాక్ డౌన్‌ల అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఒక వేళ లాక్ డౌన్ విధించాల్సి వ‌స్తే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత క్షీణిస్తుంది. నిరుద్యోగం పెరుగుతుంది. నిత్య‌వ‌స‌ర ధ‌రలు ఆకాశాన్ని అంటుతాయి. అలాంటి ప‌రిస్థితి రాకుండా ప్ర‌భుత్వాలు ముందు జాగ్ర‌త్త చ‌ర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉన్న న్యూయ‌ర్‌, క్రిస్మ‌స్ వేడుకుల‌ను, ఇత‌ర స‌భ‌లు, స‌మావేశాల‌ను ర‌ద్దు చేస్తున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలో త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోనుంది. ఈ విష‌యంలో ఇది వ‌ర‌కే హైకోర్టు సూచ‌న‌లు చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios