Asianet News TeluguAsianet News Telugu

ఎల్ జేపీ సంక్షోభం : ‘నాకు మత్తు ఇచ్చి లైంగికదాడి..’ తిరుగుబాటు ఎంపీపై సంచలన ఆరోపణలు..

లోక్ జనశక్తి పార్టీలో తిరుగుబాటు జరిగిన నాటినుంచి ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరాస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అబ్బాయి వ్యవహారశైలి కారణంగానే.. ముఖ్యంగా పార్టీని పరిరక్షించేందుకే తాను మిగతా ఎంపీలతో బయటకు వచ్చానని బాబాయ్ చెబుతుంటే.. వెన్నుపోటు రాజకీయాలు చేశారని చిరాగ్ ఆరోపిస్తున్నారు. 

New twist in LJP crisis : Complaint of sexual abuse against rebel Chirag cousin - bsb
Author
Hyderabad, First Published Jun 17, 2021, 5:00 PM IST

లోక్ జనశక్తి పార్టీలో తిరుగుబాటు జరిగిన నాటినుంచి ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరాస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అబ్బాయి వ్యవహారశైలి కారణంగానే.. ముఖ్యంగా పార్టీని పరిరక్షించేందుకే తాను మిగతా ఎంపీలతో బయటకు వచ్చానని బాబాయ్ చెబుతుంటే.. వెన్నుపోటు రాజకీయాలు చేశారని చిరాగ్ ఆరోపిస్తున్నారు. 

ముఖ్యంగా ఈ కుట్ర వెనుక జేడీయూ హస్తం ఉందని, ప్రస్తుతం తమ పార్టీలో సంక్షోభానికి నితీష్ కుమార్ వర్గం కారణమని ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా తన కజిన్, ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ (రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు రామచంద్ర పాశ్వాన్ తనయుడు) సైతం తమ అంకుల్ పశుపతితో చేతులు కలిపి తనను ఒంటరి చేశారనే బాధ చిరాగ్ ను వేధిస్తోందని ఆ కుటుంబ సన్నిహితులు అంటున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో.. ఓ కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మూడు పేజీలతో కూడిన తన ఫిర్యాదులో.. ‘నా డ్రింక్ లో మత్తుమందు కలిపి ప్రిన్స్ రాజ్.. ఢిల్లీలోని ఓ హోటల్ లో నాపై అత్యాచారం చేశారు’ అని ఆమె ఆరోపించారు. 

ఇక ఈ విషయంపై స్పందించిన పోలీసులు, ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని, అయితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. అత్యాచార ఆరోపణల గురించి చిరాగ్ పాశ్వాన్ దృష్టికి రాగా, తనకు పూర్తి వివరాలు తెలియదని, ఇరు వర్గాలను పోలీసులను సంప్రదించమని తాను సలహా ఇచ్చానని పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. 

కాగా దివంగత కేంద్ర, మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన తనయుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్జేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దింపి నితిశ్ కుమార్ కు సవాల్ విసిరారు. 

అప్పటి నుంచి చిరాగ్, పశుపతి మద్య తలెత్తిన విభేదాలు ముదిరి తిరుగుబాటుకు దారి తీసింది. ఇక ఈ ఎన్నికల్లో ఎల్టేజీ విఫలమైనప్పటికీ తన ఓట్ల శాతం మాత్రం పెరిగిందని చిరాగ్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాన్ని, పార్టీని కలిపి ఉంచేందుకు తను చేసిన ప్రయత్నాలు వృథా అయిపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios