ఈడీతో నేను సెట్ చేస్తా, 200 కోట్లు ఇస్తారా .. ఎంపీ తమ్ముడు బేరసారాలు : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్త ట్విస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం పూటకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఎంపీ తమ్ముడు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో ఇతను బేరసారాలు సాగించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

ఆర్ధిక నేరాలకు పాల్పడితే ఈడీ వస్తుంది. ఈ నేరాలకు పాల్పడిన వారికి ఈడీతోనే సెటిల్‌మెంట్ చేస్తానని ముందుకు వచ్చాడు ఒక ఎంపీ తమ్ముడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈడీ .. సదరు ఎంపీ తమ్ముడిని విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపింది. ఈ నెల 9న సదరు సెటిల్‌మెంట్ సోదరుడు ఈడీ ముందు విచారణకు వెళ్తున్నాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాం అనేక మలుపులు తిరుగుతోంది. లిక్కర్ స్కాంలో సెటిల్‌మెంట్ వ్యవహారం .. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీలో తీగ లాగితే దక్షిణాది రాష్ట్రాల్లో డొంక కదులుతోంది. ఓ వైపు ఎంపీ తమ్ముడిని ఈడీ విచారణకు పిలవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ ఎంపీ సోదరుడు ఈ నెల 9న ఈడీ ముందుకు హాజరుకానున్నాడు. లిక్కర్ స్కాంలో ఈడీతో సెటిల్ చేస్తానని సదరు ఎంపీ తమ్ముడు బేరసారాలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈడీతో సెట్ చేస్తానంటూ రూ.200 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
ALso REad:ఢిల్లీ లిక్కర్ స్కాం : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు సీబీఐ రిప్లై... డేట్ , టైం ఫిక్స్
అయితే సదరు ఎంపీ తమ్ముడు ఈడీతో సెట్ చేస్తానని ఎవరిని సంప్రదించాడు. కేసులో ఇరుక్కున్న వారితో ఎంపీ తమ్ముడు ఎలా డీల్ చేశాడు. కుంభకోణంలో వున్న వారిని ఎవరి ద్వారా కలిశాడు. డబ్బు వసూలు చేయడానికే కేసులో వున్న వారిని సంప్రదించాడా లేదంటే ఆయన వెనుక ఇంకెవరైనా వున్నారా ..? వారితో ఏ అంశాల గురించి ప్రస్తావించాడన్న దానిపై ఈడీ విచారించనుంది. ఎంపీ తమ్ముడు ఈడీ ముందు విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం వుంది.