Asianet News TeluguAsianet News Telugu

ఆరుషి కేసులో కీలక మలుపు..కేసు రీ-ఓపెన్ చేయాలంటూ సీబీఐ పిటిషన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమె తల్లిదండ్రులు రాజేష్, నూపుర్ తల్వార్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 

new twist in aarushi murder case
Author
Delhi, First Published Aug 10, 2018, 2:40 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమె తల్లిదండ్రులు రాజేష్, నూపుర్ తల్వార్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. 2008లో మే 16వ తేదీని ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని జలవాయువిహార్‌ సెక్టార్ 25లో డాక్టర్ ఎస్ తల్వార్ కుమార్తె ఆరుషి తల్వార్ దారుణ హత్యకు గురయ్యారు..

ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు ఇంట్లో పనిమనిషి కనిపించడం లేదని మీడియా బయటపెట్టింది. ఆరుషిని బలవంతం చేసిన పనిమనిషి హేమరాజ్.. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో హత్యకు పాల్పడి వుంటాడని కథనాలు ప్రసారం చేసింది.. ఆ తర్వాతి రోజే హేమరాజ్ మృతదేహం ఇంటి టెర్రస్ మీద కనిపించడంతో దేశం ఉలిక్కిపడింది.. ఆరుషికి, హేమరాజ్‌కు అక్రమ సంబంధం ఉందని.. దీని వల్లే కుటుంబసభ్యులు వారిద్దరినీ హత్య చేసి ఉంటారని ఒక వాదన బయటకు వచ్చింది.

మరోవైపు రాజేశ్ తల్వార్ పనిచేసే ఆసుపత్రిలోని ఇద్దరు ఆరుషి మీద కన్నేశారని... వారే ఇంట్లో ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించి ఆరుషి ఒప్పుకోకపోవడంతో హత్య చేశారని.. ఆ హత్యను హేమరాజ్ చూడటం వల్ల అతనిని కూడా చంపివేశారని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి ఆరుషి తల్లిదండ్రులను  దోషులుగా నిర్థారిస్తూ ఘజియాబాద్‌ కోర్టు తల్వార్ దంపతులకు యావజ్జీవ శిక్ష విధించింది.

దీనిపై రాజేశ్ తల్వార్ అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా తేలుస్తూ 2017లో కోర్టు తీర్పు వెలువరించింది. మరోవైపు తల్వార్ దంపతులను నిర్దోషులుగా పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ.. పనిమనిషి హేమరాజ్ భార్య వేసిన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉంది... తాజాగా సీబీఐ కూడా పునర్విచారణ కోరుతూ పిటిషన్ వేయడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios