సభను నిష్పక్షపాతంగా నడుపుతానన్నారు నూతన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. బుధవారం స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. సభను నియమ, నిబంధనలకు అనుగుణంగా నడుపుతానని హామీ ఇచ్చారు.

పార్టీల బలాబలాలలకతీతంగా సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సభను నడుపుతానని ఓమ్ బిర్లా తెలిపారు. 17వ లోక్‌సభలోనూ ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సభలో ప్రతి ఒక్కరి సమస్యలను విని వారికి సావధానంగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. సభను సజావుగా నడిపేందుకు ప్రతి ఒక్క సభ్యుడు సహకరించాలని స్పీకర్ కోరారు. సభా సమయం వృథా చేయకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాలను మాత్రమే సభలో ప్రస్తావించాలని స్పీకర్ సూచించారు.