Asianet News TeluguAsianet News Telugu

అలర్ట్.... 12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపుపన్ను వెబ్ సైట్

ఈ వెబ్ సైట్ లో ఇతర సేవలూ అందుబాటులో ఉండవని ఆదాయపు  పన్ను విభాగం వెల్లడించింది. ఈ ఏడాది పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి ఈ పోర్టల్ లో  సమస్యలు వస్తూనే ఉన్నాయి.  ఈ Income tax website ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్ సంస్థ  సీఈఓతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  చర్చించి,  సమస్యలను పరిష్కరించ వలసిందిగా ఆదేశించారు.

New income tax online portal will be unavailable for 12 hours this weekend
Author
Hyderabad, First Published Oct 23, 2021, 8:27 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నిర్వహణా పరమైన పనుల్లో భాగంగా  ఆదాయపుపన్ను వెబ్ సైట్ దాదాపు పన్నెండు గంటలపాటు నిలిచిపోనుంది.  శనివారం పది గంటల ఆదివారం ఉదయం పదిగంటల నుంచి మంగళవారం ఉదయం పది గంటల వరకు సేవలు అందుబాటులో ఉండావని ఆదాయపు పన్ను విభాగం తన వెబ్ సైట్ http:///www.incometax.gov.in  లో ప్రకటించింది.

 ఈ సమయంలో E -filing portal ద్వారా  రిటర్నులు  సమర్పించడం సాధ్యం కాదు.  ఈ వెబ్ సైట్ లో ఇతర సేవలూ అందుబాటులో ఉండవని ఆదాయపు  పన్ను విభాగం వెల్లడించింది. ఈ ఏడాది పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి ఈ పోర్టల్ లో  సమస్యలు వస్తూనే ఉన్నాయి.  ఈ Income tax website ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్ సంస్థ  సీఈఓతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  చర్చించి,  సమస్యలను పరిష్కరించ వలసిందిగా ఆదేశించారు.

వెబ్సైట్లో తలెత్తుతున్న సమస్యల దృష్ట్యా  రిటర్న్ ల దాఖలుకు  గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.  రెండువేల 21-22 మదింపు సంవత్సరానికి (2020-21 ఆర్థిక సంవత్సరం) సంబంధించి ఇప్పటి వరకు 2 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు వచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం ట్విటర్ లో పేర్కొంది. 

ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్: ఐ‌టి‌ఆర్-1 ఫార్మ్ ఉపయోగించే జీతం పొందే వారు ఈ 9 డాక్యుమెంట్స్ తప్పనిసరి..

 ఇన్ కం టాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఇలా...
అత్యంత సాధారణమైంది - ఐ‌టి‌ఆర్-1 లేదా సహజ్ (Sahaj) ఫారం - జీతం పొందే  పన్ను చెల్లింపుదారులు నింపాలి. ఈసారి ఫారమ్ కోసం మినహాయించని అలవెన్సులు, వేతనానికి అదనంగా పొందే చెల్లింపులు, ఇతరత్రా అవసరాల వంటి ప్రత్యేక రంగాలలో అసెస్సీ వివరాలను కోరుతుంది.

ఐ‌టి‌ఆర్-1 (ITR-1)లేదా సహజ్ ఫారం(sahaj form)ని దాఖలు చేయడానికి మీరు తప్పనిసరిగా ఈ 9 డాక్యుమెంట్స్ లేదా సమాచారాన్ని తప్పక ఉంచుకోవాలి

1. సాధారణ సమాచారం
పాన్
ఆధార్ కార్డ్ నంబర్

2. జీతం/పెన్షన్ : ఉద్యోగి (ల) నుండి ఫారం 16

3. హౌస్ ప్రాపర్టీ నుండి ఆదాయం
అద్దె రిసిప్ట్ 
వడ్డీ కోత గురించి హౌసింగ్ లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్

4. ఇతర సోర్సెస్ 
సేవింగ్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ  గురించి బ్యాంక్ స్టేట్‌మెంట్/పాస్‌బుక్ 

5. చాప్టర్ VI-A కింద డిడక్షన్ క్లెయిమ్ 
PF/NPSకి మీ కాంట్రీబుషన్ 

మీ పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు

లైఫ్ ఇన్షూరెన్స్ ప్రీమియం రిసిప్ట్ 

స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు

మీ హోమ్ లోన్ పై ప్రిన్సిపాల్ రిపేమెంట్  

ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్/మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు

80Gకి అర్హమైన విరాళాల వివరాలతో  రిసిప్ట్ 

అగ్రిగేట్ మొత్తం తగ్గింపు  u/s 80C, 80CCC, 80CCD (1), గరిష్ట పరిమితి రూ .1.5 లక్షల వరకు పరిమితం చేయబడుతుంది.
 
6. చాప్టర్ VIA పార్ట్ B కింద ఏదైనా తగ్గింపు క్లెయిమ్ చేయడం కోసం మీరు ఏప్రిల్ 1, 2020 నుండి జూలై 31, 3030 మధ్య ఏదైనా పెట్టుబడి/డిపాజిట్/చెల్లింపులు చేసినట్లయితే షెడ్యూల్ Dlని నింపండి.
 
7. ట్యాక్స్ పేమెంట్ వివరాలు

మీ ఫారం 26ASలో ఉన్న టాక్స్ చెల్లింపు వివరాలను వేరిఫై చేయండి

8. టి‌డి‌ఎస్ వివరాలు

మీ ఫారమ్ 16 (జీతం), 16A (నాన్-సాలరి), 16C (రెంట్) లో క్రెడిట్ మొత్తాన్ని,  టి‌ఏ‌ఎన్ వివరాలు  వేరిఫై చేయండి

టెనెంట్  పాన్/ఆధార్

9. ఇతర సమాచారం

వ్యవసాయ ఆదాయం, డివిడెండ్ వంటి మినహాయింపు  ఆదాయం (రిపోర్టింగ్ ప్రయోజనం కోసం మాత్రమే)

భారతదేశంలో ఉన్న అన్ని యాక్టివ్ బ్యాంక్ ఖాతాల వివరాలు (రీఫండ్ క్రెడిట్ కోసం కనీసం ఒక ఖాతాను ఎంచుకోవాలి)

రిలీఫ్ u/s 89 క్లెయిమ్ చేయబడితే ఫారం 10E

పన్ను చెల్లింపుదారులు (tax payers)2020-21 ఆర్థిక సంవత్సరానికి (AY 2021-22) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేస్తారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే క్రమంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) మళ్లీ పొడిగించినట్లు గమనించవచ్చు. ఐ‌టి‌ఆర్ ని దాఖలు చేయడానికి కొత్త గడువు సెప్టెంబర్ 30 నుండి 31 డిసెంబర్ 2021కి మార్చబడింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios