కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తీసుకురాలేదన్నారు ప్రధాని మోడీ. కొత్త వ్యవసాయ చట్టాలు కావాలని ఆర్ధిక, వ్యవసాయ నిపుణులు కూడా కోరారని ఆయన తెలిపారు.

20 ఏళ్లుగా రాష్ట్రాలతో ప్రభుత్వాలు చర్చిస్తున్నాయని మోడీ గుర్తుచేశారు. వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. రుణమాఫీ అని చెప్పిన యూపీఏ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

స్వామినాథన్ రిపోర్టును కాంగ్రెస్ తగులబెట్టిందని.. కొత్త వ్యవసాయ చట్టాలను రైతులే కొన్నేళ్లుగా కోరుతున్నారని నరేంద్రమోడీ తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టం అంశం కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో వుందన్నారు.

కనీస మద్ధతు ధరపై రైతులకు హామీ ఇస్తున్నానని ప్రధాని చెప్పారు. మద్ధతు ధరపై విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని.. స్వామినాథన్ కమిటీ నివేదికను విపక్షాలు పట్టించుకోవడం లేదని మోడీ ఆరోపించారు.