Road Accident: హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ దేబ్ కుమార్ తృటిలో తప్పించుకున్నారు. హర్యానా బీజేపీ రాష్ట్ర ఇంచార్జీగా ఉన్న బిప్లబ్ కుమార్ దేబ్ ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది.
Ex-Tripura CM Biplab Deb Kumar: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు బిప్లబ్ కుమార్ దేబ్ ప్రయాణిస్తున్న కారు హర్యానాలోని పానిపట్ లో జీటీ రోడ్డులో ప్రమాదానికి గురైంది. ఈ కారు ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. హర్యానా బీజేపీ రాష్ట్ర ఇంచార్జీగా ఉన్న బిప్లబ్ కుమార్ దేబ్ ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది.
వివరాల్లోకెళ్తే.. త్రిపుర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకులు బిప్లబ్ కుమార్ దేబ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హర్యానాకు బీజేపీ రాష్ట్ర ఇంచార్జీగా ఉన్న దేబ్ ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తుండగా సామ్లాఖా- పానిపట్ మధ్య జీటీ రోడ్డులో ఆగి ఉన్న వాహనాన్ని ఆయన కారు ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సమల్ఖా) ఓం ప్రకాశ్ తెలిపారు. జీటీ రోడ్డులో ఓ కారు టైరు పంక్చర్ కావడంతో ఆగిపోయింది. వెనుక నుంచి వస్తున్న దేవ్ వాహనం ఆగి ఉన్న కారును ఢీకొట్టిందని ఆయన చెప్పారు.
కాగా, ఇటీవల త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో బిప్లబ్ కుమార్ దేబ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖలో అంతర్గత పోరు కారణంగా 2022 మే 14న బిప్లబ్ కుమార్ దేబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీ ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
