నేటి నుంచి అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు: మీరు తెలుసుకోవాల్సిన టాప్ 10 మార్పులివే

new criminal laws in india: దేశ వ్యాప్తంగా కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. దీంతో వలస పాలకులు చేసిన పాత చట్టాలకు కాలం చెల్లించింది. కొత్త నేర చట్టాల ద్వారా అమలులోకి వచ్చిన ప్రధాన అంశాలివే.

New criminal laws come into force today: Top 10 changes you need to know GVR

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు నేటి (జూలై 1) నుంచి అమలులోకి వచ్చాయి. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలకు స్వస్తి చెబుతూ మోదీ 2.0 ప్రభుత్వంలో వీటిని ప్రవేశపెట్టారు. పాత భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం- 2023 చట్టాలు దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చాయి. వీటి ద్వారా భారతదేశ నేర న్యాయ వ్యవస్థలో గణనీయంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేంటంటే....

బ్రిటిష్‌ కాలం ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ స్థానంలో యాక్ట్‌లకు గత అర్ధరాత్రితో కాలం ముగిసింది. కొత్త చట్టాల ద్వారా కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ చట్టాల ప్రకారం...

1. విచారణ ముగిసిన తర్వాత తప్పనిసరిగా 45 రోజుల్లోపు క్రిమినల్ కేసుల్లో తీర్పులివ్వాలి. మొదటి విచారణ జరిగిన 60 రోజుల్లోపు ఛార్జిషీట్‌ దాఖలు చేయాలి. సాక్షుల భద్రత, సహకారం కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షుల రక్షణ పథకాలను తప్పనిసరిగా అమలు చేయాలి.

2. అత్యాచార బాధితుల నుంచి స్టేట్‌మెంట్‌లను మహిళా పోలీసు అధికారి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా బాధితురాలి సంరక్షకుడు లేదా బంధువు సమక్షంలో జరగాలి. ఈ కేసుల్లో మెడికల్ రిపోర్టులు ఏడు రోజుల్లో పూర్తి చేయాలి.

3. చట్టంలోని కొత్త అధ్యాయం మహిళలు, పిల్లలపై నేరాలను ప్రస్తావిస్తుంది. పిల్లలను కొనడం లేదా అమ్మడం ఘోరమైన నేరంగా కొత్త చట్టం వర్గీకరించారు. ఈ నేరాలకు పాల్పడినవారికి కఠినమైన శిక్షలు, జరిమానాలు ఉంటాయి. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. 

4. తప్పుడు వాగ్దానాలు, అవాస్తవాలు చెప్పి పెళ్లి చేసుకొని.. మహిళలను వదిలేసిన కేసులకు కొత్త చట్టం ప్రకారం శిక్షలు ఉన్నాయి.

5. మహిళలపై నేరాల బాధితులు 90 రోజులలోపు వారి కేసులపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు పొందేందుకు అర్హులు. నేరాల్లో బాధితులైన మహిళలు, పిల్లలకు అన్ని ఆసుపత్రుల్లో ఉచిత ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్స అందించాలి.

6. నిందితులు, బాధితుడు ఇద్దరూ 14 రోజుల్లోపు FIR, పోలీసు నివేదిక, ఛార్జ్ షీట్, స్టేట్‌మెంట్‌లు, ఒప్పుకోలు, ఇతర పత్రాల కాపీలను స్వీకరించడానికి అర్హులు. కేసు విచారణలలో అనవసరమైన జాప్యాన్ని నివారించడానికి కోర్టులకు గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే అనుమించింది కొత్త చట్టం.

7. నేరాలకు సంబంధించిన సంఘటనలను ఇప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా నివేదించవచ్చు. దీని ద్వారా పోలీసు స్టేషన్‌ను బాధితులు సందర్శించాల్సిన అవసరం ఉండదు. జీరో ఎఫ్‌ఐఆర్‌ను ప్రవేశపెట్టడం వల్ల వ్యక్తులు అధికార పరిధితో సంబంధం లేకుండా ఏదైనా పోలీసు స్టేషన్‌లో ప్రథమ సమాచార నివేదికను దాఖలు చేసే వెసులుబాటు కలిగింది. 

8. అరెస్టయిన వ్యక్తికి వారి పరిస్థితి గురించి తనకు నచ్చిన వ్యక్తికి తెలియజేయడానికి హక్కు ఉంటుంది. తద్వారా అతను తక్షణ సహాయం, మద్దతు పొందవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు సులభంగా యాక్సెస్ చేయడానికి పోలీసు స్టేషన్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలలో అరెస్టు వివరాలు ప్రముఖంగా ప్రదర్శిస్తారు.

9. ఫోరెన్సిక్ నిపుణులు తీవ్రమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను సందర్శించడం, సాక్ష్యాలను సేకరించడం ఇప్పుడు తప్పనిసరి.

10. ‘‘లింగం’’ (gender) గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు.. ఇప్పుడు స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా అవకాశమిచ్చారు. అలాగే, మహిళలపై జరిగిన కొన్ని నేరాలకు సంబంధించి.. సాధ్యమైనప్పుడు మహిళా మేజిస్ట్రేట్ ద్వారా బాధితుల వాంగ్మూలాలు నమోదు చేయాలి.
మహిళా మేజిస్ట్రేట్‌ అందుబాటులో లేకపోతే, పురుష మేజిస్ట్రేట్ తప్పనిసరిగా మహిళ సమక్షంలో స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలి. అత్యాచారానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌లను తప్పనిసరిగా ఆడియో-వీడియో మార్గాల ద్వారా నమోదు చేయాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios