కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు మరణాలు సైతం భారీగానే నమోదవుదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

కోవిడ్‌ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారు వీటిని ఖచ్చితంగా పాటించాలని కోరింది. స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితం కావాలని సూచించింది. బీపీ, షుగర్‌ ఉన్నవారు వైద్యుల సలహా పాటించాలని వెల్లడించింది. కోవిడ్ బాధితులు 3 పొరల మాస్క్‌ ధరించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.,

వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ రూపంలో వుండే ఆహారం తీసుకోవాలని ప్రజలకు విన్నవించింది. ఆక్సిజన్‌ స్థాయిలు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని . ఐసోలేషన్‌ నుంచి పది రోజుల తర్వాత బయటకు రావొచ్చని తెలిపింది. చివరి 3 రోజుల్లో జ్వరం రాకపోతే కరోనా పరీక్ష అవసరం లేదని స్పష్టం చేసింది.

కాగా, దేశంలో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. 4 లక్షలు కరోనా కేసులు దాటడం దేశంలో ఇది రెండోసారి. గత ఏడాది కరోనా జూన్ 22వ తేదీన  4 లక్షల కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో 4,12,262 మందికి కరోనా సోకింది. 24 గంటల్లో కరోనాతో 3980 మంది మరణించారు.

Also Read:కరోనాలో ఇండియా రికార్డు: 24 గంటల్లో 4 లక్షలు దాటిన కేసులు, 4 వేల మంది మృతి

ఒక్క రోజులోనే కరోనా నుండి 3,29,113 మంది మరణించారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,77,410కి చేరుకొంది. ఇప్పటివరకు 2,30,168 మంది మరణించారు.ఇప్పటివరకు 1,72,80,844 మంది కోలుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు 16,25,13,339 మంది వ్యాక్సినేషన్ చేయించుకొన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలోని మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదౌతున్నాయి. 20 శాతానికి పైగా పాజిటివిటీ గల రాష్ట్రాల్లో  13వ స్థానంలో ఏపీ రాస్ట్రం నిలిచింది.  దేశంలో కరోనా కేసులు 4 లక్షలు దాటడం ఈ ఏడాది ఇదే ప్రథమం.  కరోనాతో  దేశంలో 4 వేల మంది మరణించారు. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 50 వేలు కేసులు దాటాయి. కేరళ రాష్ట్రంలో ఒక్క రోజులోనే  40 వేలు దాటాయి.