Asianet News TeluguAsianet News Telugu

దశాబ్దకాలంగా గబ్బిళ్లాల్లో కరోనా వైరస్

కొన్ని దశాబ్దాల నుంచి గబ్బిలాల్లో ఈ వైరస్‌లు ఉంటున్నాయని వారు తేల్చారు. ‘వైరస్ వంశాన్ని గుర్తించడం వల్ల, వాటి నుంచి మనుషులకు సోకకుండా జాగ్రత్త పడొచ్చని’ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

New Coronavirus Circulated Unnoticed In Bats For Decades: Study
Author
Hyderabad, First Published Jul 30, 2020, 1:24 PM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ వైరస్ చైనా నుంచి ఇతర దేశాలకు పాకిందన్న విషయం అందరికీ తెలిసిందే.  కాగా... తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

గబ్బిలాల్లో ఎన్నో దశాబ్దాలుగా గుర్తించకుండా కరోనా వైరస్‌ ఉంటున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హార్స్ షూ గబ్బిలాలు సార్స్‌ కోవ్-2‌ వైరస్‌లకు మూలమని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైనమిక్స్‌కు చెందిన మాసిజ్ బోని నేతృత్వంలోని పరిశోధకులు తేల్చారు.  ఈ అధ్యయనం నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. కొన్ని దశాబ్దాల నుంచి గబ్బిలాల్లో ఈ వైరస్‌లు ఉంటున్నాయని వారు తేల్చారు. ‘వైరస్ వంశాన్ని గుర్తించడం వల్ల, వాటి నుంచి మనుషులకు సోకకుండా జాగ్రత్త పడొచ్చని’ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

దీంతో శాస్త్రవేత్తలు  వైరస్‌ మూలాన్ని గుర్తించే పనిలో పడ్డారు. అసలు ఈ కరోనా ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? మూలాలు ఏంటని చాలా మంది శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. గబ్బిలాలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు  కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమని యూఎస్‌ ప్రభుత్వ అధికారులు ఆరోపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ నెలలో దీనిని అధ్యయనం చేసేందుకు నిపుణులను చైనాకు పంపింది. ఈ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎంతోమంది పరిశోధకులు కూడా పలు కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు


 

Follow Us:
Download App:
  • android
  • ios